బండ్ల గణేష్.( Bandla Ganesh )ఈ పేరు వింటే మనకి గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శివుడికి నంది, పవన్ కళ్యాణ్ కి ఈ బండ్ల గణేష్ అంటూ చెప్పుకొని తిరిగే ఆయన ఈమధ్య పవన్ కళ్యాణ్ పేరు తియ్యడానికి కూడా ఇష్టపడకపోవడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) కావాలని దూరం పెట్టించాడని బండ్ల గణేష్ ట్విట్టర్ సాక్షిగా ఎన్నో సార్లు కామెంట్స్ చేసాడు.అంతే కాదు ‘గబ్బర్ సింగ్'( Gabbar Singh ) చిత్రం తనని నిలబెట్టింది అని చెప్పుకొని తిరిగే బండ్ల గణేష్ మొన్న ఈ చిత్రం వార్షికోత్సవం నాడు ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు.
దీనిని బట్టీ ఆయన పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ మీద ఏ రేంజ్ లో పగ పెంచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.ఛాన్స్ దొరికితే త్రివిక్రమ్ ని డైరెక్టుగా, పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా తిట్టేస్తున్నాడు,సెటైర్లు వేస్తున్నాడు, ఇదంతా చూస్తూ ఉంటే పెద్ద వ్యవహారమే నడిచినట్టుగా అనిపిస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘వకీల్ సాబ్'( Vakeel Saab ) అనే చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల్ గణేష్ ఇచ్చిన స్పీచ్ అప్పట్లో ఎంత వైరల్ అయ్యిందో మనం చూసాము.‘ఈశ్వరా.పవనేశ్వరా’ అని ప్రారంభిస్తూ ఆయన ఇచ్చిన ఆ ప్రసంగం అప్పట్లో పెను దుమారమే రేపింది.అయితే బండ్ల గణేష్ ప్రసంగిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో( AP Politics ) పవన్ కళ్యాణ్ ప్రస్థానం గురించి కూడా మాట్లాడుతూ అధికార వైసీపీ పార్టీ పై ఛలోక్తులు విసిరాడు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రసంగం లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ , ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డాడు.
సినిమా ఫంక్షన్ లో రాజకీయం గురించి మాట్లాడే పరిస్థితి కల్పించింది బండ్ల గణేష్ మాత్రమే.
ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అలా మాట్లాడాడో, అప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘వకీల్ సాబ్’ చిత్రం పై తన ప్రతాపం ని చూపించింది.విడుదల రోజు తెల్లవారు జామున వేయాల్సిన బెన్ఫిట్ షోస్ ని రద్దు చేసి, సరికొత్త జీవో ని అమలు చేసింది.మొదటి రోజు అమ్ముడుపోయిన బెన్ఫిట్ షోస్ అన్ని కూడా క్యాన్సిల్ అవ్వడం వల్ల సుమారుగా 7 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లింది అట.ఇక ఆ తర్వాత నాల్గవ రోజు నుండి ఈ చిత్రానికి టికెట్ రేట్స్ భారీ గా తగ్గించేశారు, అందువల్ల ఫుల్ రన్ లో మరో 33 కోట్ల రూపాయిలు నష్టం.అలా ఫుల్ రన్ లో 130 కోట్ల రూపాయిల షేర్ వసూలు చెయ్యాల్సిన ఈ సినిమా, కేవలం 90 కోట్ల రూపాయిల క్లోసింగ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అలా బండ్ల గణేష్ కారణం గా వకీల్ సాబ్ చిత్రం 40 కోట్లు నష్టపోయిందని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.