మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన హీరో అజిత్... శుభాకాంక్షలు చెబుతున్న ఫ్యాన్స్!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో అజిత్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Hero Ajith Has Entered Another New Business Details, Ajith,ak Moto Rides,bike R-TeluguStop.com

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఇతర వ్యాపార రంగాలలో కూడా స్థిరపడిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే హీరో అజిత్ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

అంతేకాకుండా ఈయనకు బైక్ రైడింగ్(Bike Riding) అంటే ఎంత పిచ్చి ఉందో అందరికీ తెలిసిందే.

Telugu Ajith, Ajithak, Ajith Enter, Ak Moto Rides, Bike, Kollywood, Latest-Movie

షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన బైక్ రైడింగ్ వెళ్తూ ఎప్పటికప్పుడు తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ సరికొత్త టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు.బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి అజిత్ బైక్ రైడింగ్ కు సంబంధించిన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.సాధారణంగా చాలామందికి బైక్ రైడింగ్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ వారి దగ్గర సరైన బైక్స్ అందుబాటులో లేక అలాగే ఎక్కడ ఎలా వెళ్లాలి అనే విషయాలు తెలియక వారి రైడింగ్ మధ్యలోనే ఆపేసుకుంటూ ఉంటారు.

అలాంటి వారి కోసమే ఈయన ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

Telugu Ajith, Ajithak, Ajith Enter, Ak Moto Rides, Bike, Kollywood, Latest-Movie

అజిత్ ఏకే మోటో రైడ్స్ (AK Moto Rides) అనే కంపెనీ ఏర్పాటు చేసి బైక్ రైడింగ్ అంటే ఇష్టం ఉన్నటువంటి ఔత్సాహికులకు బైక్ రైడింగ్ చేయడానికి అన్ని విధాలుగా సర్వీసెస్ అందజేయడం జరుగుతుంది.దేశవ్యాప్తంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి బైక్ రైడర్స్ ను తమ గైడ్ గా తీసుకొని ఈ బైక్ రైడింగ్ లో పాల్గొనవచ్చు.అయితే ఇందుకుగాను భారీ మొత్తంలోనే చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది.

ఇలా అజిత్ ఏకే మోటో రైడ్స్( Ajith AK Bike Rides ) అనే కంపెనీ ప్రారంభించబోతున్నారని తెలియడంతో తప్పకుండా ఈ వ్యాపారంలో మంచి సక్సెస్ సాధిస్తారని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తూ తమ అభిమాన హీరోకి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube