మీరు బ్యాంక్( Bank ) నుంచి లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఓ శుభవార్త.మీరు ఎస్‌బీఐ( SBI ) ఖాతాదారులైతే మీకిదే తరుణోపాయం.
ఎస్‌బీఐ నుంచి పర్సనల్ లోన్( Personal Loan) పొందాలని భావించే వారు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి.అవసరమైన డాక్యుమెంట్లు కలిగి ఉంటే సులభంగా లోన్ పొందొచ్చు.
ఎలిజిబిలిటీ లేకపోతే మాత్రం లోన్ రావడం దాదాపు అసాధ్యం.తక్కువ ప్రాసెసింగ్ ఫీజు, క్విక్ లోన్ ప్రాసెసింగ్, నో హిడెన్ చార్జీలు, ఈజీ ఈఎంఐ, కనీస డాక్యుమెంటేషన్ వంటి బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు.
మీరు ఇపుడు ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఎస్‌బీఐ వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.ఎస్‌బీఐ ఇపుడు క్విక్ లోన్ కింద రూ.20 లక్షల వరకు లోన్ సదుపాయాన్ని కలిగిస్తోంది.ఐతే ఉద్యోగులకు మాత్రమే ఈ లోన్ వర్తిస్తుందని గుర్తు పెట్టుకోవాలి.
ఇక శాలరీ అకౌంట్( Salary account ) అనేది ఇతర బ్యాంకుల్లో ఉండాలి.నెలకు కనీసం రూ.15 వేల జీతం కలిగి ఉండాలి.సెంట్రల్, స్టేట్, పీఎస్‌యూ, కార్పొరేట్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పని చేసే వారు ఈ తరహా రుణాలు పొందొచ్చు.
వయసు 21 నుంచి 58 ఏళ్ల మధ్యలో ఉండి, కనీసం ఏడాది నుంచి అయినా ఉద్యోగం చేస్తూ ఉండాలి.ఎస్‌బీఐ అందిస్తున్న ఈ తరహా రుణాలపై వడ్డీ రేటు 11 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.ఇది కాస్త తక్కువ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు.
స్టేట్ బ్యాంక్ క్విక్ పర్సనల్ లోన్ పొందాలని భావించే వారు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, అక్కడ లోన్స్ కేటగిరి ఉంటుంది.అందులో పర్సనల్ లోన్స్ ఎంచుకొని, తర్వాత అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరి.అయితే ఇక్కడ తీసుకున్న రుణాన్ని 72 నెలల లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్, బ్యాంక్ స్టేట్‌మెంట్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, శాలరీ స్లిప్స్, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.