ప్రభుత్వ ఉద్యోగిపై చిరు వ్యాపారి దాడి.. రోడ్డుపై పరిగెత్తించి మరి..!

రోడ్డుపై వ్యాపారం చేసుకునే ఓ చిరు వ్యాపారి నడిరోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా ప్రభుత్వ ఉద్యోగిని పరిగెత్తించి మరి దాడి చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్( Uttar Pradesh ) లో చోటుచేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చేరి తెగ వైరల్ అయింది.

 A Petty Trader Attacked A Government Employee And Ran On The Road , Uttar Prades-TeluguStop.com

కొందరు నెటిజన్స్ సమర్థిస్తే.మరికొందరు విమర్శిస్తున్నారు.

అసలు ఏం జరిగిందో చూద్దాం.

వివరాల్లోకెళితే.

ఉత్తరప్రదేశ్లోని నోయిడా అథారిటీ( Noida Authority ) చెందిన ఉద్యోగులు నగరంలో ఉండే రోడ్లపై అక్రమంగా ఉండే దుకాణాలను, కట్టడాలను తొలగిస్తున్నారు.మున్సిపాల్టీ నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై వ్యాపారం చేస్తున్న స్ట్రీట్ వెండర్స్ ను ఖాళీ చేయిస్తున్నారు.

ఈ క్రమంలోనే సమోసా బండిని తొలగించమని చిరు వ్యాపారికి తెలిపారు.చిరు వ్యాపారికి ప్రభుత్వ ఉద్యోగికి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది.

సమోసా బండి బోల్తా పడడంతో సమోసా వ్యాపారి కోపంతో బండిని తోసేస్తావా అంటూ రగిలిపోయాడు.అంతేకాకుండా వేడివేడి చట్నీ ప్రభుత్వ ఉద్యోగిపై వేసే ప్రయత్నం చేయగా.

ప్రభుత్వ ఉద్యోగి నడిరోడ్డుపై పరుగులు తీశాడు.ఆ ఉద్యోగిని సమోసా వ్యాపారి వెంబడించి ఎట్టకేలకు వేడివేడి చట్నీ ఆ ఉద్యోగి వీపుపై వేశాడు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Telugu General, Latest Telugu, Noida, Uttar Pradesh-Latest News - Telugu

ఈ ఘటన పై స్థానికంగా ఉండే ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పొట్టకూటి కోసం రోడ్డుపై చిరు వ్యాపారం చేసి వ్యక్తిపై దాడి చేసి సమోసా బండి తోసేయడం కరెక్ట్ కాదని స్థానికంగా అందరూ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఉద్యోగులు ఆ చిరు వ్యాపారి బండి తోసేసి అతడి పొట్ట కొట్టారని వాపోయారు.

మరికొంతమంది ఆ చిరు వ్యాపారి దాడి చేయడం కరెక్ట్ కాదని, ప్రభుత్వ ఉద్యోగి నిబంధనల ప్రకారమే ఆ బండిని తొలగించమని చెప్పినప్పుడు.ఆ బండి తొలగించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని అంటున్నారు.

రోడ్లపై వ్యాపారం చేయకూడదు అనే నిబంధనలు ఉన్నాయని విషయం వాళ్లకి తెలియదా అంటూ నెటిజన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube