గుర్తుల పై బీఆర్ఎస్ టెన్షన్ ! శుభవార్త చెప్పిన ఈసీ

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) కు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పెద్ద రిలీఫ్ దొరికింది.ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలి ఉన్న గుర్తులు ఇబ్బందికరంగా మారింది.

 Brs Tension On The Marks! Ec Who Gave The Good News, Brs, Telangana, Telangana-TeluguStop.com

బీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన కారు గుర్తును పోలిన గుర్తులకు వెళ్లడంతో, చాలా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమికి చెందడం వంటివి చోటు చేసుకున్నాయి.దీంతో అనేకసార్లు రాష్ట్ర , కేంద్ర ఎన్నికల సంఘం ను కలిసి ఈ విషయంపై ఫిర్యాదు బీఆర్ఎస్ నాయకులు చేశారు.

బీఆర్ ఎస్ కు మరింత నష్టం కలగకముందే, కారు గుర్తును పోలి ఉన్న మిగతా గుర్తులు తొలగించాలని కోరింది.ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు ఎనిమిది ఉన్నాయని , వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కోరింది.

Telugu Dubbaka, Symbols, Munugodu, Telangana-Politics

ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ( Vikas Raj )ను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు.గతంలో జరిగిన దుబ్బాక హుజురాబాద్( Dubbaka Huzurabad ) ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కారు గుర్తును పోలి ఉన్న రిక్షా ట్రక్,  ఆటో, టోపీ, ఇస్త్రీ పెట్టె గుర్తులు కారణంగా ఓటర్లు గందరగోళానికి గురై, కారు గుర్తుకు బదులు వేరే గుర్తులకు ఓటు వేసినట్లు బీఆర్ఎస్ అప్పట్లోనే దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది.కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను తొలగించాలని, మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.బీ ఆర్ ఎస్ విజ్ఞప్తి మేరకు కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించింది.

దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వెల్లడించింది.ఏపీలో రెండు, తెలంగాణలో నాలుగు పార్టీలకు ఈ గుర్తింపు లభించింది .

Telugu Dubbaka, Symbols, Munugodu, Telangana-Politics

ఏపీలో వైసిపి, టిడిపిలు( YCP , TDP ) తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ , తెలుగుదేశం వైఎస్సార్, టిడిపి పార్టీలు రాష్ట్ర పార్టీ హోదా పొందినట్లు వెల్లడించింది.కేంద్ర ఎన్నికల సంఘం 193 ఫ్రీ సింబల్స్ ను విడుదల చేసింది.దీంట్లో ఆటో రిక్షా ,హ్యాట్ , ఇస్త్రీ పెట్టె, ట్రక్కు గుర్తులను ఏపీ తెలంగాణకు ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చింది .బీ ఆర్ ఎస్ పార్టీ సింబల్ ఉండడంతో , వాటిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ సింబల్ జాబితా నుంచి తొలగించడంతో బీఆర్ఎస్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube