7వ రోజు అక్కడ జీరో షేర్.. విరూపాక్ష దారుణమైన వసూళ్లు!

టైర్ 2 హీరోల్లో ఒకరైన సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తో వచ్చి ఇన్నేళ్ల గ్యాప్ ను ఒక్క సినిమాతోనే ఫుల్ ఫిల్ అయ్యేలా చేసుకున్నాడు.సాయి తేజ్ హీరోగా సంయుక్త మీనన్( Samyuktha Menon ) హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా విరూపాక్ష.

 Sai Dharam Tej Virupaksha Movie Zero Share Details, Virupaksha Movie, Karthik Va-TeluguStop.com

(Virupaksha ) మొదటి రోజు కంటే ఆ తర్వాత వీకెండ్ లో పుంజుకుని స్ట్రాంగ్ వసూళ్లను రాబట్టింది.ఇక రెండవ వారం, మూడవ వారాలు కూడా బాగానే కలెక్షన్స్ రాబట్టింది.

కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయి సాయి తేజ్ కు గ్రేట్ కంబ్యాక్ ఇచ్చింది.ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ అందుకుంది.

అయితే ఇక్కడ సూపర్ హిట్ అయిన ఈ సినిమాను మే 5న తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేసారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా పక్క భాషల్లో మాత్రం ఘోరంగా విఫలం అయ్యింది.హర్రర్ థ్రిల్లర్ ను పక్క భాషల్లో వారు ఆదరిస్తారు అని మేకర్స్ అనుకున్నారు కానీ వీరి అంచనాలను తిరగరాసింది.ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన 7వ రోజు ఆ భాషల్లో ఈ సినిమాకు జీరో షేర్ వచ్చిందట.

అంతే ఒక్కటంటే ఒక్క లక్ష కూడా వసూళ్లు చేయలేదు.

ఇలా విరూపాక్ష లాగా ఏ తెలుగు సినిమాకు కూడా జీరో షేర్ రాలేదు అని ట్రేడ్ వర్గాలు సైతం చెబుతున్నారు.దీంతో ఇంత సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.ఇంట భారీగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రచ్చ గెలవలేక పోయింది.ఇక ఈ సినిమా ఇప్పటి వరకు 90 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లు రాబట్టగా.46 కోట్లకు పైగా షేర్ ను వసూళ్లు చేసింది.దీంతో 23 కోట్లకు పైగా లాభాలను సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube