కేజ్రీవాల్ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.ఈ మేరకు ఎన్నిక అయిన రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే అధికారాలు ఉండాలని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ కేసులో ఈ తీర్పును వెలువరించింది ధర్మాసనం.పాలనను కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడానికి వీలులేదని సీజేఐ పేర్కొంది.
జవాబుదారీతనం రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపింది.శాసనాలు చేసే అధికారాలు ప్రజలు ఢిల్లీ అసెంబ్లీకి ఇచ్చారన్న కోర్టు అసలైన అధికారం ఎన్నికైన ప్రభుత్వానికే ఉండాలని వెల్లడించింది.
ఈ క్రమంలోనే రాష్ట్రాల విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది.ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానిదే అధికారమన్న న్యాయస్థానం గవర్నమెంట్ కు అనుకూలంగానే లెఫ్టినెంట్ గవర్నర్ పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
న్యాయ వ్యవహారాలు, శాంతి భద్రతల విషయంలోనే కేంద్ర జోక్యం ఉంటుందని వెల్లడించింది.