ఆస్ట్రేలియాకు తలనొప్పిలా మారిన కంగారూలు.. కాల్చి చంపడమే మార్గమా..?

ఆస్ట్రేలియాలో కంగారూల సంతతిని అదుపు చేయకుంటే రానున్న రోజుల్లో అవి భారీగా చనిపోతాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.బయటి వ్యక్తులు కంగారూ అంటే ఆస్ట్రేలియన్( Australian ) అరణ్యానికి చెందినదని వెంటనే గుర్తిస్తారు.

 Australian Govt Officials Suggest Culling Kangaroos Before They Starve To Death,-TeluguStop.com

కానీ ఆ దేశంలో మాత్రం ఇదే పర్యావరణానికి పెద్ద తలనొప్పిగా మారింది.కంగారూలు ‘‘బూమ్ అండ్ బస్ట్’’( Boom and Bust ) జనాభా చక్రాన్ని కలిగి వుంటాయి.

మంచి సీజన్‌లో పశుగ్రాసం పుష్కళంగా వున్నప్పుడు వాటి సంఖ్య పది మిలియన్ల వరకు పెరుగుతందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ కంగారూల గుంపుల దాడి కారణంగా గడ్డివాములు నాశనం అవుతాయని.

ఆహారం లేనిపక్షంలో అవి ఆకలితో చనిపోతాయని పర్యావరణ శాస్త్రవేత్త కేథరీన్ మోస్బీ హెచ్చరించారు.

Telugu Australian, Boom Bust, Catherine, Dennis, Kangaroos-Telugu NRI

గతంలో దేశంలో కరువు సంభవించిన ప్రాంతాల్లో 80 నుంచి 90 శాతం కంగారూలు చనిపోయాయని అంచనా వేసినట్లు కేథరీన్ ( Catherine )పేర్కొన్నారు.ఆకలిని తట్టుకోలేక.పబ్లిక్ టాయిలెట్‌లలోకి వెళ్లి టాయిలెట్ పేపర్ తినడం వంటివి చేస్తున్నాయని ఆమె చెప్పారు.

కంగారూలను రక్షించాలంటే వాటిని కాల్చి చంపడం, మాంసం ఉత్పత్తులను పెంచడం వంటివి చేయాలన్నారు.లేనిపక్షంలో దేశంలో కరువు వచ్చినప్పుడు సంక్షేమ చర్యలను ప్రజలు పొందలేరని కేథరీన్ హెచ్చరించారు.

కంగారూలు( Kangaroos ) ఆస్ట్రేలియాలో రక్షించబడుతున్నాయని.కానీ ఇవి అంతరించిపోయే జాతుల జాబితాలో లేనందున అధికార పరిధిలో వీటిని కాల్చిచంపవచ్చు.

అయితే ప్రభుత్వ అనుమతి మాత్రం తప్పనిసరి.ప్రతి ఏడాది స్వదేశీ పరిశ్రమ అవసరాల కోసం దాదాపు ఐదు మిలియన్ల కంగారూలను అక్కడ కాల్చి చంపుతున్నారు.

మాంసం, పెంపుడు జంతువులకు ఆహారం, తోలు కోసం ఇలా చేస్తున్నారు.

Telugu Australian, Boom Bust, Catherine, Dennis, Kangaroos-Telugu NRI

ఆస్ట్రేలియాలో కంగారూ ఇండస్ట్రీకి అసోసియేషన్‌కు చెందిన డెన్నిస్ కింగ్( Dennis King ) మాట్లాడుతూ.దేశం మరోసారి కంగారూ విజృంభణకు దారి తీసిందన్నారు.కంగారూల సంతానోత్పత్తి చక్రం వేగంగా వుందన్నారు.2000వ దశకం ప్రారంభంలో కరువు కారణంగా జాతీయ స్థాయిలో కంగారూల జనాభా 30 మిలియన్ల లోపు పడిపోయిందని.అయితే అది త్వరలోనే 60 మిలియన్లకు చేరుకోవచ్చని కింగ్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube