కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్‌లో( Alberta, Canada ) కార్చిచ్చు అధికార యంత్రాంగం, ప్రజలను వణికిస్తోంది.దీని వల్ల ఇప్పటి వరకు దాదాపు 30,000 మంది నిరాశ్రయులయ్యారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అల్బెర్టా ప్రావిన్స్‌లో శనివారం అత్యవసర పరిస్థితిని విధించారు.అంతేకాదు.
ఈ ప్రాంతంలోని చమురు ఉత్పత్తిదారులను ఉత్పత్తి నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.కెనడా చమురు ఉత్పత్తిలో ఈ ప్రాంతం వాటా భారీగా వుంది.
రోజుకు ఇక్కడ కనీసం 1,85,000 బారెల్స్ చమురు ఉత్పత్తి అవుతుంది.సోమవారం మధ్యాహ్నం నాటికి కార్చిచ్చు 98 శాతం చురుగ్గానే వుందని అగ్నిమాపక శాఖ అధికారులు( Fire Department officials ) తెలిపారు.30 చోట్ల మంటలను అదుపు చేయడం కష్టంగా వుందన్నారు.
700 మందికిపైగా అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.అల్బెర్టాతో పాటు ఇతర ప్రావిన్సుల నుంచి మరో 1000 మందిని సహాయక చర్యల కోసం రప్పిస్తున్నారు.అలాగే అగ్నిమాపక నైపుణ్యాలు వున్న వాలంటీర్లు ( Volunteers )కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో దేశానికి సాయం చేసేందుకు ముందుకు రావాలని ప్రభుత్వం కోరుతోంది.
వీరితో పాటు యువతను పెద్ద సంఖ్యలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు ప్రీమియర్ డేనియల్ స్మిత్( Premier Daniel Smith ) తెలిపారు.కార్చిచ్చు కొన్ని నెలల పాటు కొనసాగవచ్చని.
అందుచేత ఇక్కడ అవసరమైన అన్ని వనరులను ముందే సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.అల్బెర్టా ప్రావిన్స్ ఇప్పటికే సైనిక సహాయంతో పాటు ఫెడరల్ ప్రభుత్వం నుంచి సహాయాన్ని అభ్యర్ధించింది.
ప్రధాని జస్టిన్ ట్రూడోతో ( Prime Minister Justin Trudeau )డేనియల్ స్మిత్ ఇప్పటికే దీనిపై మాట్లాడారు.
ఇకపోతే.కెనడా ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు.దాని చమురు ఉత్పత్తుల్లో 80 శాతం అల్బెర్టా ప్రావిన్స్ నుంచే వస్తోంది.
కార్చిచ్చు కారణంగా అల్బెర్టాలో చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థలు తాత్కాలికంగా మూతపడ్డాయి.దీని ప్రభావం ఇంధన ధరలపై లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
డేటా ప్రొవైడర్ రిఫినిటివ్ ప్రకారం.యునైటెడ్ స్టేట్స్‌కు కెనడియన్ రోజువారీ సహజ వాయువు ఎగుమతులు ఆదివారం 6.7 బిలియన్ల క్యూబిక్ అడుగులకు పడిపోయాయి.ఇది ఏప్రిల్ 2021తో పోల్చితే అతి తక్కువ.
చమురుతో పాటు అల్బెర్టా.కెనడాలో అతిపెద్ద పశువులను ఉత్పత్తి చేసే ప్రావిన్స్.
ప్రస్తుతం కార్చిచ్చు కారణంగా పశువులను వాటి యజమానులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.