2023, మే 4న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్( Vladimir Putin )ను చంపే లక్ష్యంతో ఉక్రెయిన్ క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడికి ప్రయత్నించింది.ఉక్రెయిన్ ఈ దాడి చేసినట్లు అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు కానీ ఈ సంఘటన ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
రష్యా సైన్యం, భద్రతా దళాలు దాడికి ఉపయోగించిన రెండు డ్రోన్లను( Drone attack ) ఎలాంటి హాని చేయకముందే నిలిపివేయగలిగాయి.ఈ సంఘటనను ప్రణాళిక ఉగ్రవాద చర్య, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడిపై మర్డర్ అటెంప్ట్‌గా రష్యన్స్ అభివర్ణించారు.
అధ్యక్షుడు పుతిన్ క్షేమంగా ఉన్నారని, ఆయన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నారని క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది.దాడికి ప్రయత్నించినట్లు చెప్పడానికి మద్దతుగా ఎటువంటి ఆధారాలు సమర్పించబడలేదు.అలానే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.
అయితే, రష్యా సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న ఒక వీడియోను పరిశీలిస్తే క్రెమ్లిన్‌పై పొగలు కమ్ముకున్నాయని కనిపించింది.ఇది ఉక్రేనియన్ డ్రోన్ దాడి ఫలితమని అధ్యక్ష పరిపాలన పేర్కొంది.
ఉక్రెయిన్( Ukraine ) చేసినట్లు చెబుతున్న ఈ డ్రోన్ల దాడిపై ఉగ్రవాద దర్యాప్తును రష్యా ప్రారంభించింది.ఈ ఘటనతో వివాదాస్పద ప్రాంతమైన క్రిమియాపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు.2014 నుంచి రెండు దేశాలు క్రిమియాపై తీవ్ర వివాదంలో నిమగ్నమై ఉన్నాయి, ఉద్రిక్తతలు హింసాత్మక ఘర్షణలుగా మారుతున్నాయి.కొన్ని నెలల క్రితం రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్య కూడా ప్రారంభించింది.
ఈ దండయాత్రలో ఎంతో మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు.