Gopichand: సక్సెస్ కోసం 13 ఏళ్ళ తర్వాత ఆ పని చేస్తున్న గోపి చంద్

గోపి చంద్ …( Gopichand ) ఎవరు ఎన్ని చెప్పిన ఇతడొక అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న నటుడు.కానీ ప్రస్తుతం గోపి చంద్ కి అర సక్సెస్ కూడా చేతిలో లేదనే చెప్పాలి.

 Gopi Chand Again Doing Cop Role-TeluguStop.com

సరైన సబ్జెక్టు పడితే మాత్రం ఎంత కష్టమైన చేయగల గట్స్ ఉన్న హీరో.అయితే ఈ మధ్య కాలంలో అతడు తీస్తున్న సినిమాలు వరసగా పరాజయం పాలు అవుతున్నాయి.

దానికి గల ముఖ్య కారణం మంచి కథలను ఎంచుకోక పోవడమే.అయితే గోపి చంద్ కి బాగా కలిసి వచ్చిన పాత్రలు ఏమైనా ఉన్నాయ్ అంటే అది పోలీస్ ఆఫీసర్స్ రోల్స్.

( Cop Roles ) ఇప్పటి వరకు కెరీర్ లో మూడు సార్లు కాప్ రోల్ చేసి కమర్షియల్ గా బ్రహ్మాండమైన హిట్ కొట్టారు.

Telugu Andhrudu, Golimaar, Gopi Chand, Gopichand, Gopichand Cop, Gopichand Role,

గోపి చంద్ కాప్ రోల్ చేసిన సినిమాల విషయానికి వస్తే 2005 లో మొదటి సారి ఆంధ్రుడు( Andhrudu Movie ) చిత్రంలో కనిపించారు.ఈ సినిమాకు పరుచూరి మురళి దర్శకత్వం వహించగా గోపి చంద్ కి మంచి విజయం అందించింది.ఇక రెండవ సారి 2008 లో సౌర్యం సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ గా నటించి పెద్ద విజయాన్ని దక్కించుకున్నారు.

ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా ఉన్న శివ దర్శకత్వం వహించగా, అనుష్క హీరోయిన్ గా చేసింది.ఈ సినిమా తర్వాత చివరగా గోలీమార్ సినిమాలో గోపి చంద్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాగా ఈ చిత్రంలో ప్రియ మణి హీరోయిన్ గా కనిపించారు.

ఈ సినిమాను పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించగా చాల మంచి డీసెంట్ హిట్ కొట్టింది.

Telugu Andhrudu, Golimaar, Gopi Chand, Gopichand, Gopichand Cop, Gopichand Role,

ఇక ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాలు మళ్లి గోపి చంద్ కి పడలేదు కానీ ఇప్పుడు రామ బాణం( Ramabanam Movie ) అనే సినిమాలో నటిస్తున్నాడు.అయితే అతి త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా, గోపి చంద్ 31 వ సినిమా లో మరోమారు పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు.గోపి చంద్ కి ఇన్నాళ్లకు తనకు సూట్ అయ్యే మరొక సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

కొంత మంది హీరోలకు కొన్ని పాత్రలు బాగా సూట్ అవుతాయి.అలాంటి పాత్రల్లో ఒకటి గోపి చంద్ కి పోలీస్ పాత్ర.ఇక ఈ సినిమా అయినా విజయం సాధించి గోపి చంద్ కి విజయం వారించాలని అయన అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube