ఎన్టీఆర్‌ కూడా ఫ్యామిలీతో ఎగిరి పోతే ఎంత బాగుంటుంది...!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్( Young Tiger NTR ) మొన్నటి వరకు కొరటాల దర్శకత్వంలో దర్శకత్వం లో రూపొందుతున్న ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ లో పాల్గొన్న విషయం తెల్సిందే.రామోజీ ఫిల్మ్‌ సిటీ లో సినిమా యొక్క కీలక సన్నివేశాలు నిర్వహించారు.

 Ntr Family Going To Holyday Trip,ntr Family,mahesh Babu Family,star Heroes,janhv-TeluguStop.com

సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) కూడా పాల్గొన్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఎన్టీఆర్‌ 30 సినిమా యొక్క తాజా షెడ్యూల్‌ ని ముగించిన ఎన్టీఆర్ త్వరలోనే ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే మహేష్ బాబు దంపతులు( Mahesh Babu Couple ) మరియు పిల్లలు కలిసి విదేశాలకు యాత్ర కు వెళ్లిన విషయం తెల్సిందే.ఇంకా ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మందే విదేశాలకు సమ్మర్ ట్రిప్‌ కోసం వెళ్లారు.ఎన్టీఆర్‌ 30 సినిమా షూటింగ్ ను ముగించుకున్న ఎన్టీఆర్‌ ఒకటి రెండు రోజుల్లోనే విదేశాలకు వెళ్తాడు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు.ఇద్దరు కొడుకులు మరియు భార్య తో కలిసి ఎన్టీఆర్ విదేశీ యాత్ర కు వెళ్తాడని.

వచ్చిన తర్వాత మళ్లీ కొత్త షెడ్యూల్ ను ప్లాన్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

దాదాపుగా మూడు వారాల వరకు విదేశీ పర్యటనలో ఎన్టీఆర్‌ కుటుంబం( NTR Family ) ఉంటుందట.జూన్‌ లో తిరిగి వస్తారనే వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

తప్పకుండా ఎన్టీఆర్‌ 30 సినిమా( NTR 30 ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.ఈ సినిమా లో ఎన్టీఆర్ కి జోడీగా ముద్దుగుమ్మ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా లో మరో నటి కూడా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా యొక్క విడుదల తేదీ కూడా ప్రకటించారు.

వచ్చే ఏడాది సమ్మర్‌ లో ఏప్రిల్‌ లో సినిమా ను విడుదల చేయబోతున్నారు.ఎన్టీఆర్ గత చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో కొరటాల శివ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube