అక్కినేని అఖిల్( Akkineni Akhil ) నటించిన లేటెస్ట్ మూవీ ”ఏజెంట్”.( Agent ) ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.
రిలీజ్ కు ముందు వరుస పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు.టీమ్ అంతా రెండేళ్ల పాటు ఎంతో కస్టపడి చేసిన ఈ సినిమా రిలీజ్ రోజే ప్లాప్ అయ్యింది.
ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ”ఏజెంట్” సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి( Surendar Reddy ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ రిలీజ్ తర్వాత దారుణంగా నిరాశ పరిచింది.ఈ సినిమా ఈ రేంజ్ లో ఫెయిల్ అవ్వడంతో ఈ సినిమా ఫెయిల్యూర్ ను నిర్మాతే స్వయంగా తీసుకొని స్పదించడం గ్రేట్ అనే చెప్పాలి.నిర్మాత అనిల్ సుంకర( Producer Anil Sunkara ) ఈ సినిమా ఫెయిల్యూర్ బాధ్యత మాదే అంటూ చెప్పాడు.

అయితే ఈయన అలా చెబుతూనే తమ చిత్రాన్ని పూర్తి స్క్రిప్ట్ లేకుండానే తెరకెక్కించమని కూడా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.అఖిల్ వంటి హీరోతో ఆయన మార్కెట్ కు మించి బడ్జెట్ పెడుతున్నప్పుడు స్క్రిప్ట్ పక్కాగా లేకుండానే సెట్స్ మీదకు వెళ్లడం ఒకరంకంగా సాహసం అనే చెప్పాలి.మరి ఆ రిస్క్ వల్లనే ఇప్పుడు నిర్మాత పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది.ఇదిలా ఉండగా ఈయన చేసిన కామెంట్స్ తో ఇప్పుడు సరికొత్త చర్చ జరుగుతుంది.
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇలానే స్క్రిప్ట్ లేకుండానే ఏ సినిమాలు వచ్చాయి? ఇప్పుడు ఏవైనా ఇలానే తెరకెక్కుతున్నాయా అంటూ సోషల్ మీడియాలో సీరియస్ డిస్కషన్ సాగుతుంది.అయితే వీటిలో పలు టాప్ సినిమాల పేర్లు కూడా వినిపించడం గమనార్హం.
ఏది ఏమైనా ఇలా స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో లేకుండానే సెట్స్ మీదకు వెళ్లడం నిర్మాత మీద భారాన్ని వేయడమే.