ఈ ఐపీఎల్ లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన టాప్ ఫైవ్ ఆటగాళ్లు వీళ్లే..!

ఐపీఎల్( IPL ) సీజన్ లో బెంగళూరు జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్( Mohammed Siraj ) అత్యధిక డాట్ బాల్స్ వేసిన మొదటి బౌలర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు.డాట్ బాల్స్ తో సెంచరీ పూర్తి చేసిన ఆటగాడిగా తొలి స్థానంలో మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు.

 These Are The Top Five Players Who Scored The Most Dot Balls In This Ipl 2023 Sh-TeluguStop.com

అంతేకాకుండా ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో కూడా సిరాజ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఇక పర్పుల్ క్యాప్ రేసులో రషీద్ ఖాన్( Rashid Khan ) 14 వికెట్లు తీసి రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ ఐపీఎల్ 2023 లో మహమ్మద్ సిరాజ్ బెంగళూరు జట్టు తరఫున ఇప్పటివరకు మొత్తం 32 ఓవర్లు బౌలింగ్ వేశాడు.అందులో అతను 100 డాట్ బాల్స్ వేశాడు.ఇక ఈ జాబితా లో మహమ్మద్ షమీ( Mohammad Shami ) రెండవ స్థానంలో ఉన్నాడు.మహమ్మద్ షమీ వేసిన 31 ఓవర్లలో మొత్తం 95 డాట్ బాల్స్ వేశాడు.

తర్వాత పంజాబ్ జట్టు బౌలర్ అర్షదీప్ సింగ్ 29 ఓవర్లలో 69 డాడ్ బాల్స్ వేసి మూడవ స్థానంలో ఉన్నాడు.

వరుణ్ చక్రవర్తి 33.4 ఓవర్లలో 74 డాడ్ బాల్స్ వేసి నాలుగో స్థానంలో ఉన్నాడు.భువనేశ్వర్ కుమార్ 27 ఓవర్లలో 71 డాట్ బాల్స్ తో ఐదో స్థానంలో ఉన్నాడు.

ఈ సీజన్లో ఇప్పటివరకు మహమ్మద్ సిరాజ్ అద్భుత ఆటను ప్రదర్శించాడు.ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడి 16.64 సగటుతో 14 వికెట్లు తీశాడు.ఇతని ఎకనామీ రేటు 7.28, బౌలింగ్ స్ట్రైక్ రేట్ 13.71గా ఉంది.ఇక మహమ్మద్ సిరాజ్ తన ఐపీఎల్ లో మొత్తం 73 మ్యాచ్లు ఆడాడు.29.92 సగటుతో మొత్తం 73 వికెట్లు తీశాడు.మొత్తంగా ఎకనామీ రేటు 8.59 గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube