దేవుడా.. డిజాస్టర్ అయిన ఏజెంట్ సినిమా కథ కోసం అన్ని రూ.కోట్లు ఇచ్చారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో సురేందర్ రెడ్డి( Surender Reddy ) ఒకరు కాగా అతనొక్కడే సినిమాతో ఈ దర్శకుని కెరీర్ మొదలైంది.జయాపజయాలకు అతీతంగా సురేందర్ రెడ్డి కెరీర్ ను కొనసాగించారు.

 Shocking Facts About Agent Movie Remuneration Details Here Goes Viral,akhil Akki-TeluguStop.com

కిక్, రేసుగుర్రం, ధృవ సినిమాలు ఈ దర్శకుడి రేంజ్ ను పెంచాయి.అయితే సైరా నరసింహారెడ్డి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలవగా ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏజెంట్ సినిమా విషయంలో సురేందర్ రెడ్డి చేసిన తప్పులు చాలానే ఉన్నాయి.

అయితే ఈ సినిమాకు వక్కంతం వంశీ( Vakkantham Vamshi ) కథా రచయితగా పని చేశారని చాలా తక్కువమందికి తెలుసు.ఈ సినిమా స్క్రిప్ట్ కోసం వక్కంతం వంశీ ఏకంగా 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.ఏ మాత్రం ఆసక్తికరంగా లేని ఈ సినిమా కథ, కథనం కోసం మేకర్స్ ఆ రేంజ్ లో ఖర్చు చేశారని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.

ఏజెంట్ సినిమాలోని తల, తోక లేని కథనాన్ని చూసి యాక్షన్ సినిమాల అభిమానులు సైతం షాకవుతున్నారు.ఏప్రిల్ 28 టాలీవుడ్ ఇండస్ట్రీకి లక్కీ డేట్ కాగా ఏజెంట్ సినిమా( Agent Movie ) మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.ఏజెంట్ తరహా సినిమాలకు మేకర్స్ ఇకనైనా దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.ఏజెంట్ మూవీ రెండో రోజు కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి.రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు కోటి రూపాయల కంటే తక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అఖిల్ కెరీర్ లో ఈ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమా మరొకటి లేదని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా టోటల్ కలెక్షన్లు 10 కోట్ల రూపాయలను మించే అవకాశం లేదని తెలుస్తోంది.ఏజెంట్ సినిమా నష్టాల విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube