దేవుడా.. డిజాస్టర్ అయిన ఏజెంట్ సినిమా కథ కోసం అన్ని రూ.కోట్లు ఇచ్చారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో సురేందర్ రెడ్డి( Surender Reddy ) ఒకరు కాగా అతనొక్కడే సినిమాతో ఈ దర్శకుని కెరీర్ మొదలైంది.

జయాపజయాలకు అతీతంగా సురేందర్ రెడ్డి కెరీర్ ను కొనసాగించారు.కిక్, రేసుగుర్రం, ధృవ సినిమాలు ఈ దర్శకుడి రేంజ్ ను పెంచాయి.

అయితే సైరా నరసింహారెడ్డి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలవగా ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏజెంట్ సినిమా విషయంలో సురేందర్ రెడ్డి చేసిన తప్పులు చాలానే ఉన్నాయి.

"""/"/ అయితే ఈ సినిమాకు వక్కంతం వంశీ( Vakkantham Vamshi ) కథా రచయితగా పని చేశారని చాలా తక్కువమందికి తెలుసు.

ఈ సినిమా స్క్రిప్ట్ కోసం వక్కంతం వంశీ ఏకంగా 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.

ఏ మాత్రం ఆసక్తికరంగా లేని ఈ సినిమా కథ, కథనం కోసం మేకర్స్ ఆ రేంజ్ లో ఖర్చు చేశారని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.

"""/"/ ఏజెంట్ సినిమాలోని తల, తోక లేని కథనాన్ని చూసి యాక్షన్ సినిమాల అభిమానులు సైతం షాకవుతున్నారు.

ఏప్రిల్ 28 టాలీవుడ్ ఇండస్ట్రీకి లక్కీ డేట్ కాగా ఏజెంట్ సినిమా( Agent Movie ) మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

ఏజెంట్ తరహా సినిమాలకు మేకర్స్ ఇకనైనా దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.ఏజెంట్ మూవీ రెండో రోజు కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి.

రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు కోటి రూపాయల కంటే తక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అఖిల్ కెరీర్ లో ఈ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమా మరొకటి లేదని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా టోటల్ కలెక్షన్లు 10 కోట్ల రూపాయలను మించే అవకాశం లేదని తెలుస్తోంది.

ఏజెంట్ సినిమా నష్టాల విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి ‘  కేటీఆర్ సెటైర్లు