అఖిల్ ఏజెంట్‌ ప్రీ రిలీజ్ గెస్ట్‌ విషయంలో ఇంట్రెస్టింగ్‌ రూమర్‌

అక్కినేని హీరో అఖిల్ ( Akhil )ఏజెంట్ చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.గత వారం ప్రేక్షకులు ముందుకు వచ్చిన శాకుంతలం చిత్రం నిరాశ పరిచింది.

 Prabhas Guest For Akhil Akkineni Agent Film , Agent Movie, Akhil Akkineni, Prabh-TeluguStop.com

ఇక నేడు విడుదల అయిన సాయి ధరమ్‌ విరూపాక్ష సినిమా ఎలా ఉంటుంది అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.ఇక ఇదే సమయంలో వచ్చే వారం విడుదల కాబోతున్న అఖిల్ ఏజెంట్ కి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడం లో చిత్ర యూనిట్ సభ్యులు దాదాపుగా సఫలం అయినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ను అతి త్వరలో భారీ ఎత్తున నిర్వహించేందుకు గాను నిర్మాత అనిల్ సుంకర( Anil Sunkara ) ఏర్పాట్లు చేస్తున్నాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏజెంట్ సినిమా( Agent movie ) యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది.

అతి త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యొక్క తేదీ మరియు ఇతర విషయాలను ఎప్పుడెప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటిస్తారా అనే ఉబలాటం తో చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎదురు చూస్తూ ఉన్నారు.ప్రభాస్ మరియు అఖిల్ సన్నిహితులు.ఆ కారణం గానే ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ హాజరు అయ్యేందుకు ఓకే చెప్పి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

ప్రభాస్ ( Prabhas )హాజరు అయితే కచ్చితంగా ఏజెంట్ యొక్క స్థాయి పెరుగుతుంది అనే అభిప్రాయంను బయ్యర్లు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.ఇక ఏజెంట్ సినిమా విషయానికొస్తే గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

సురేందర్ రెడ్డి భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను రూపొందించాడు అంటూ తాజాగా విడుదల అయిన ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది.ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube