అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్( Agent ) చిత్రానికి దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఖర్చు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు స్వయంగా ప్రకటించారు.అనధికారికంగా వస్తున్న వార్తల ప్రకారం సినిమాకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఉంటుందట.
ఇక ఈ సినిమాకు అంత ఖర్చు పెట్టి తీయాల్సిన అవసరమేంటి అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం అఖిల్ అక్కినేని కి ఇది కచ్చితంగా అతి పెద్ద డిజాస్టర్ అవుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అఖిల్ మార్కెట్ మీ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఖర్చు చేయాల్సి ఉంది అంటూ కొందరు ఇప్పుడు సూచిస్తున్నారు.
అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి యొక్క నమ్మకం ఏంటి అంటే.గతంలో తాను చేసిన కిక్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఇప్పుడు అదే తరహాలో రచయిత వక్కంతం వంశీతో కలిసి చేశాను కనుక కిక్ స్థాయిలో భారీ విజయాన్ని ఏజెంట్ కూడా దక్కించుకుంటుంది అని నమ్ముతున్నాడు.అందుకే తాను కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండి కాస్త ఎక్కువగానే ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది.
మొదటి సారి సురేందర్ రెడ్డి( Surender Reddy ) నిర్మాణ భాగస్వామిగా ఉండడంతో సినిమా పై ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి, అంచనాలు పెరిగాయి అనడంలో సందేహం లేదు.భారీగా సినిమా కి ఖర్చు చేయడంతో రికవరీ సాధ్యమేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వక్కంతం వంశీ( Vakkantham Vamsi ) మరియు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
కనుక ఈ సినిమా కూడా సెంటిమెంట్ తో భారీగా కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఏజెంట్ చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు.తెలుగు మరియు మలయాళం లో విడుదల కాబోతున్న ఈ సినిమా సక్సెస్ అయ్యి భారీ కలెక్షన్స్ నమోదు చేస్తే అప్పుడు హిందీలో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.