అక్కినేని నాగేశ్వర రావు నాగార్జున( Akkineni Nageswara Rao , Nagarjuna ) వరుసగా రెండు తరాల హీరోలు టాప్ హీరోలు గా మంచి పేరు తెచ్చుకుంటే మూడవ తరం హీరోలు అయిన నాగ చైతన్య అఖిల్( Naga Chaitanya , Akhil ) మాత్రం ఒక్క హిట్ కొట్టడానికి నానా తంటాలు పడుతున్నారు…అందులో భాగం గానే గత కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్ త్వరలోనే ఏజెంట్ మూవీ( Agent Movie ) తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రాన్నిసురేందర్ రెడ్డి తెరకెక్కించారు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ మూవీ ఏప్రిల్ 28న విడుదలవుతుండగా తాజాగా ఏజెంట్’ ట్రైలర్ ని విడుదల చేశారు .ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది .ఈ స్పై థ్రిల్లర్‌ను చూస్తుంటే ఇది ముగ్గురు వ్యక్తుల మధ్య థ్రిల్లింగ్ గేమ్‌ను తలపించింది.ట్రైలర్‌లో సినిమా స్టోరీలైన్ రివీల్ చేయకుండా.పూర్తిగా యాక్షన్ అండ్ చేజింగ్ సీన్లతో ఎగ్జైట్‌మెంట్ కలిగించారు.
వాస్తవానికి సురేందర్ అంటేనే స్టైలిష్ టేకింగ్‌కు పెట్టింది పేరు.ఆయన స్టైల్ ఆఫ్ యాక్షన్ ప్లస్ ఎంటర్‌టైన్మెంట్ మిస్ కాకుండా ట్రైలర్ కట్ చేశారు అయితే అఖిల్‌ను స్టైలిష్ అండ్ వైల్డ్‌గా ప్రజెంట్ చేస్తూనే కాస్త కామిక్ టచ్ కూడా యాడ్ చేశారు .అఖిల్ క్యారెక్టర్‌ను మమ్ముట్టి రివీల్ చేసే డైలాగ్‌తో పాటు ఇందులో అఖిల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.అఖిల్ ఒంటిపై బుల్లెట్స్ దండ వేసుకుని గన్‌తో ఫైరింగ్ చేసే సీన్ అదుర్స్ అనిపించింది.
అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొడుతుందా లేదా అనేది చాలా మంది కి ఉన్న పెద్ద డౌట్ సురేందర్ రెడ్డి లాస్ట్ సినిమా అయిన సైరా పెద్దగా ఆడలేదు అఖిల్ కి పెద్దగా మార్కెట్ లేదు అయినప్పటికీ వీళ్లిద్దరి మీద అంత బడ్జెట్ పెట్టిన ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి అంటూ కొందరు సినీ పెద్దలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…ఈ సినిమా ఆడితినే అఖిల్ కి క్రేజ్ ఉంటుంది ఇక ప్లాప్ అయితే మాత్రం ఇక హిట్ కొట్టడం అఖిల్ వాళ్ల కాదు అంటున్నారు.అలాగే ( Surender Reddy )కూడా ఈ సినిమా ప్లాప్ అయితే ఆయన కెరియర్ కూడా రిస్క్ లో పడుతుంది ఒక్క సినిమా మీద ఇద్దరి భవిష్యత్తు ఆధారపడి ఉంది.చూడాలి మరీ హిట్ వస్తుందా లేదా అనేది…
.