న్యూయార్క్ నగరంలో అత్యంత ఖరీదైన గ్రిల్డ్ చీజ్ శాండ్‌విచ్( Grilled Cheese Sandwich )ను ఒక రెస్టారెంట్ తయారు చేసింది.దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్( Guinness World Record ) సృష్టించింది.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గ్రిల్డ్ చీజ్ శాండ్‌విచ్‌గా చెబుతున్న దీని ధర అక్షరాలా $214 (సుమారు రూ.17,500).దానిలో గోల్డ్ కోటింగ్ ఉంటుంది.అందుకే దీనికి ఇంత ధర.అంతేకాదు ఈ శాండ్‌విచ్‌లో ప్రత్యేకమైన చీజ్‌ను కూడా ఉపయోగిస్తారు.ఈ చీజ్ ధర కిలో రూ.8,000.ఇంత విలువైన పదార్థాలతో ఈ శాండ్‌విచ్‌ను తయారు చేశారు కాబట్టే దీని ధర ఇంతలా ఉంది.
ఇక ఇందులో ఉపయోగించిన జున్నును కాసియోకావాల్లో పోడోలికో( Caciocavallo Podolico Cheese ) అని పిలుస్తారు.ఇది సంవత్సరానికి రెండు నెలలు మాత్రమే పాలను ఇచ్చే 25,000 ఆవుల పాలతో తయారు అవుతుంది.ఈ శాండ్‌విచ్‌ను సిద్ధం చేయడానికి రెస్టారెంట్‌కు 48 గంటల ముందే ఆర్డర్ ఇవ్వాలి, ఎందుకంటే వారు అరుదైన పదార్థాలను సేకరించానికి టైమ్ కావాలి.
శాండ్‌విచ్‌ను రుచి చూసిన ఒక CNBC జర్నలిస్ట్ ప్రకారం, గోల్డ్ కోటింగ్స్ పెద్దగా రుచిని జోడించవు, కానీ అవి ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి.పర్మేసన్, మాంచెగో చీజ్‌ల కలయికను పోలి ఉండే ప్రత్యేకమైన రుచితో జున్ను బాగా ఆకట్టుకుంటుంది.శాండ్‌విచ్ ఖరీదైనది అయినా, ఇది ఒక రెస్టారెంట్‌లో వింతైన ఐటమ్ గా నిలుస్తోంది.
ఈ చిన్న ఐటమ్‌ను ధనవంతులు మాత్రమే కొనుగోలు చేయగలరని చెప్పవచ్చు.ఇకపోతే గతంలో కూడా అత్యధిక రేటుతో ఫుడ్ ఐటమ్స్ చాలామందికి షాక్ ఇచ్చాయి.