టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి( SS Rajamouli ), హీరో మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమా ఇంకా మొదలు కాకముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
వీరిద్దరి కాంబినేషన్ కు సంబంధించి వార్తలు ఎప్పటినుంచో జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా అయిపోయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రూపొందున సినిమాలో నటించనున్నారు.
ఇప్పటికే రాజమౌళి ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు అన్ని పూర్తి చేసినట్టు తెలుస్తోంది.మహేష్ త్రివిక్రమ్( Mahesh Trivikram ) సినిమా అయిపోగానే వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టనున్నారు.ఇప్పటికే వీరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాపై తాజాగా ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.ఆ వివరాల్లోకి వెళితే.కాగా మహేష్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) సిద్ధం చేస్తున్నారు.
ఆఫ్రికన్ అడవుల్లో జరిగే అడ్వెంచరల్ స్టోరీగా ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రతీ సినిమాకు ఇతిహాసాలను ఆదర్శంగా తీసుకునే రాజమౌళి ఈ సినిమాకి కూడా దానినే ఫాలో అవుతున్నారు.అయితే ఈసారి కథకు సంబంధించి కాకుండా క్యారెక్టర్ లో ఇతిహాసాలను జోడించినట్లు తెలుస్తోంది.
ఈ పాన్ వరల్డ్ అడ్వెంచరల్ సినిమాలో మహేష్ క్యారెక్టర్ కు హనుమాన్ ఇన్స్పిరేషన్ అని తెలుస్తోంది.రామాయాణం ( Ramayanam )లోని హనుమంతుడి పాత్రను ఆదర్శంగా తీసుకుని సూపర్ స్టార్ క్యారెక్టర్ ను జక్కన్న డిజైన్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఆఫ్రికన్ జంగిల్ లో దెయ్యాల లాంటి వ్యక్తులతో మహేష్ జరిపే పోరాటాలు ఒళ్లు గగుర్పోడిచే విధంగా ఉంటాయని తెలుస్తోంది.ఇక దాదాపు ప్రతీ సినిమాలో రామాయాణం, మహా భారతం లాంటి ఇతిహాసాలను ప్రతి బింబించే విధంగా కథను సిద్దం చేస్తున్నారు రాజమౌలి.
ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.