చాట్‌జిపిటి ( ChatGPT )ఇపుడు సాంకేతికరంగంలో సెగలు పుట్టిస్తోంది.దీని పనితనం చూసి టెక్నాలజీ ప్రపంచం విస్తుపోతోంది అంటే అతిశయోక్తి లేదు.
దాంతో ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు చాలా కంపెనీలు ఆతృతగా ఎదురు చూస్తున్నాయి.అసైన్‌మెంట్‌లు, కంటెంట్, కోడ్ వంటివి చాట్‌జిపిటి సమర్ధవంతంగా రాసేస్తోంది.
దాంతో ఈ ఫీచర్లు విద్యార్థులకు నష్టం చేకూరుస్తాయని పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి.చాట్‌జిపిటి ప్రైవసీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇటీవల ఇటలీ దానిని నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే తన కంపెనీకి చెందిన కీలక డేటాను ఉద్యోగులు చాట్‌జిపిటికి లీక్ చేస్తున్నట్లు గుర్తించిన శామ్‌సంగ్,( Samsung ) దీనిపై ఇటీవల నిషేధం విధించింది.ఆ తరువాత కేవలం మూడే మూడు వారాల తరువాత దీని వాడకంపై ఉన్న నిషేధాన్ని కంపెనీ ఎత్తివేయడం కొసమెరుపు.ఏదిఏమైనా చాలా కంపెనీలు ఇపుడు చాట్‌జిపిటి వాడకం పట్ల మొగ్గుచూపుతున్నాయి.ది ఎకనామిస్ట్ కొరియా నివేదిక ప్రకారం… శామ్‌సంగ్ చాట్‌జిపిటిని ఉపయోగించడానికి అనుమతించిన వెంటనే, శామ్‌సంగ్ ఉద్యోగులు కనీసం మూడు సందర్భాలలో చాట్‌జిపిటికి కంపెనీ రహస్య సమాచారాన్ని లీక్ చేసారని తెలుస్తోంది.
అందుకే చాట్‌జిపిటి వాడకంలో శామ్‌సంగ్ తన ఉద్యోగులకు పరిమితులు విధిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ క్రమంలోనే చాట్‌జిపిటి అప్‌లోడ్ సామర్థ్యాన్ని ఒక్కో వ్యక్తికి 1024 బైట్‌లకు పరిమితం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.దీంతోపాటు ఇటీవల చాట్‌జిపిటికి సమాచారం లీక్ చేసిన ముగ్గురు ఉద్యోగులను కంపెనీ విచారిస్తోంది.వినియోగదారులు డేటాను ( Data ) చాట్‌జిపిటితో షేర్ చేయడం వల్ల కొన్ని రకాల సమస్యలు తలెత్తవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.