అమ్మ వద్దంటూనే కొంటాననడమేమిటి ? భలే లాజిక్ తీసిన గుడివాడ

ఆంధ్ర రాజకీయం ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant ) చుట్టూ తిరుగుతుంది.ఆంధ్ర ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అంశాన్ని ఇప్పుడు తెలంగాణ నాయకత్వం ఉన్న పార్టీ టేకప్ చేయడంతో రాజకీయం విచిత్రమైన మలుపులు తిరుగుతుంది ….

 Minister Gudivada Amarnath Counter To Brs Party Over Vizag Steel Plant Issue Det-TeluguStop.com

ఈ విషయంలో ముందుకెళ్లడం ద్వారా కచ్చితంగా పొలిటికల్ మైలేజ్ దక్కుతుంది అని అంచనా వేసుకున్న బారాసా పార్టీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తుంది.ఇప్పటికే ఈ విషయం మీద కేసీఆర్ ( Kcr ) కేంద్రం పై విమర్శలు చేశారు మూడు లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్న ప్లాంట్ ని ప్రైవేటీకరణ పేరుతో అప్పనంగా అనునయులకు కట్టబెట్టాలని చూస్తుందంటూ ఆయన కేంద్రం పై విమర్శలు చేశారు.

వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకు దారపోస్తున్న ప్రభుత్వం ఆంధ్ర ప్రజల హక్కు అయిన విశాఖపట్నం స్టీల్ ను నిలబెట్టలేదా అంటూ ఆయన ప్రశ్నించారు.

Telugu Ap Brs, Brs, Central, Cmjagan, Cm Kcr, Vizag Steel-Telugu Political News

మరోవైపు కేటీఆర్ కూడా విశాఖ హుక్కును కాపాడాలంటూ కేంద్రానికి లెటర్ కూడా రాశారు ….ఇలా స్టీల్ ప్లాంట్ వేదికగా బారాసా పార్టీ హడావిడి చేస్తుండటం ఇక్కడ అధికార పార్టీ వైసిపికి ఇబ్బందికరంగా మారింది అని వార్తలు వస్తున్నాయి ……….పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్( Minister Gudivada Amarnath ) వ్యాఖ్యలు చూస్తే ఆ వార్తలు నిజమే అనిపిస్తుంది బారాసా పార్టీ స్టీల్ ప్లాంట్ ను వేలం వేసే ప్రక్రియలో బిడ్ దాఖలు చేస్తుందని వస్తున్న వార్తల పై స్పందించమని మంత్రి గుడివాడ అమర్నాథ్ ను విలేకరుల కోరితే తమ పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నదని అందువల్ల అమ్మితే కొనాలి అన్న ఆలోచన కూడా తమకు లేదని అసలు అమ్మకుండా చూడాలన్నదే తమ అభిమతం అని ఆయన చెప్పుకోచ్చారు.

Telugu Ap Brs, Brs, Central, Cmjagan, Cm Kcr, Vizag Steel-Telugu Political News

బారసా పార్టీ ప్రైవేటీకరణకు ఒక పక్క వ్యతిరేకమని చెప్తుందని .మరి అమ్మితే బిడ్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకోవడం తమకు అర్థం కాలేదని అన్నారు ….బారాసా అధికారికంగా అలా అన్నట్టుగా కూడా తనకు సమాచారం లేదని అలాంటి పరిస్థితి అంటూ వస్తే అప్పుడు స్పందిస్తానంటూ ఆయన చెప్పుచ్చారు ఏది ఏమైనా మంత్రి గుడివాడ అమర్నాధ్ చెప్పిన విషయం లో లాజిక్ ఉన్నప్పటికీ ప్రైవేటీకరణ విషయంలో కచ్చితంగా ముందుకే వెళ్తామని ఇప్పటికే అనేకసార్లు పార్లమెంట్ వేదికగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ తీరును ఆయనకు గమనించలేదా అన్నది పెద్ద పజిల్ గా మారింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube