టాలీవుడ్ ఇండస్ట్రకి చెందిన మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ హిరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల( Upasana Konidela ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఈమె తెలుగు రాష్ట్రాల్లో తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.
ముఖ్యంగా మెగా ఇంటి కోడలిగా కంటే సొంత గుర్తింపుతో తెలుగు ప్రజలకు పరిచయమైంది.ఇక ఈమె అపోలో వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతుంది.
ఇక ఈమె పెళ్లికి ముందు రామ్ చరణ్ ను ( Ram Charan ) ఓ మీటింగ్ లో కలవడంతో ఆ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగింది.దీంతో వారి మధ్య ప్రేమ పుట్టగా కొంతకాలం రామ్ చరణ్ ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు.
ఆ తర్వాత రామ్ చరణ్ సమయం చూసుకొని చెప్పటంతో వెంటనే చిరంజీవి ( Chiranjeevi ) ఓకే అనేసి ముహూర్తాలు పెట్టాడు.
అలా వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు 2012 లో చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారు.పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా కనిపించింది.ఇప్పటికీ ఈ జంట అంతే అన్యోన్యంగా ఉన్నారు.
ఇక వీరి పెళ్లి అయ్యి పదేళ్లు పూర్తవగా ఆ మధ్యనే తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని తెలిపింది.ఇక ఈ వార్తతో పదేళ్ల కాలం ఎదురు చూసిన తన అభిమానులు చాలా సంతోషపడ్డారు.
ఇక ఉపాసనకు మాత్రం తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి.మామకు తగ్గ కోడలు అని చాలా మంది చాలా సార్లు ప్రశంసలు కురిపించారు.పైగా ఉపాసన సోషల్ సర్వీస్ లలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ప్రతి ఒక్క విషయంలో తను బాగా స్పందిస్తుంది.
ఉపాసన సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.
సోషల్ మీడియా వేదికను ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలకే కాకుండా ప్రజలకు అవసరమయ్యే విషయాలను కూడా చెప్పడానికి కూడా బాగా వాడుతుంది.చాలావరకు హెల్త్ టిప్స్ గురించి బాగా వివరిస్తుంది.గతంలో ఉపాసన కోవిడ్ సమయంలో తన హాస్పిటల్ తరఫున ఎంతోమందికి సహాయం చేసింది.
ఇక ఇప్పటికీ సహాయం చేస్తూనే ఉంది.ఇక ఆర్ఆర్ఆర్ సినిమా( RRR ) అవార్డుల సమయంలో కూడా రామ్ చరణ్ తో కలిసి విదేశాలకు వెళ్లిన ఫోటోలను, వీడియోలను కూడా బాగా షేర్ చేసుకుంది.
ఉపాసన ప్రస్తుతం ఆరోనెల ప్రెగ్నెంట్ కాగా ఆ మధ్యనే ఆమెకు తన ఫ్రెండ్స్ సీమంతం ( Upasana Baby Shower ) చేశారు.తాజాగా సోషల్ మీడియాలో ఆమె మరో వీడియో షేర్ చేసుకోగా అందులో కూడా శ్రీమంతం జరిగినట్లు కనిపించింది.
కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం కాకుండా మామూలు పద్ధతిలో ఆమెకు కొంతమంది స్నేహితులు సీమంతం చేసినట్లు కనిపించారు.ఆ వీడియోలో మెగా ఫ్యామిలీ ఎవరు కనిపించకపోగా.అది మామూలుగా ఫ్రెండ్స్ వరకు చేసుకున్నట్లు అర్థమవుతుంది.ఇక ఆ వీడియో చూసి మన సాంప్రదాయంలో చేసుకుంటే మరింత బాగుండేది అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.ఇక ఆ వీడియో చూసిన స్టార్ సెలబ్రెటీలు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.