ఏపీలో బిజెపి ఒంటరి పోరుకు సిద్దపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.ప్రస్తుతం జనసేన తో పొత్తులో ఉన్నా.
అది పేరుకే తప్ప, రెండు పార్టీలు విడి విడిగా కార్యక్రమాలు చేసుకుంటున్నాయి.జనసేన తో బీజేపీ పొత్తు ఎన్నికల వరకు కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతూ వచ్చాయి.
అయితే నిన్న మచిలీపట్నంలో జరిగిన జనసేన పదవ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మాట్లాడారు.ఈ మాటల్లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలకుండా చూస్తామని , దీనికి బిజెపి తమతో కలిసి వస్తే సరే , లేకపోతే తమ దారి తాము చూసుకుంటాం అన్నట్లుగా పవన్ మాట్లాడారు.
తాము బిజెపి కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్న పట్టించుకోకుండా వైసీపీకి ప్రాధాన్యవస్తుందనే అంశాన్ని ప్రస్తావించారు.
తెలుగుదేశం పార్టీపై ( TDP ) ప్రత్యేక అభిమానం, ప్రేమ ఏమీ లేవని చెబుతూనే, వైసిపి అధికారంలోకి రాకూడదని, తప్పని పరిస్థితుల్లో టిడిపి వైపు చూడాల్సి వచ్చిందని పరోక్షంగా పవన్ మాట్లాడారు.పవన్ వ్యాఖ్యలను పూర్తిగా విశ్లేషిస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేరని అర్థమవుతుంది.ఈసారి ఎటువంటి ప్రయోగాలు చేయబోనని చెప్పడమే కాకుండా , తాను ఈసారి బలి పశువును కాబోనని, బిజెపి కి పరోక్షంగా చురకలు అంటించారు.
ఈ వ్యాఖ్యల పై ఇప్పుడు ఏపీ బీజేపీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది.తెలుగుదేశం పార్టీపై ప్రత్యేక అభిమానం , ప్రేమ ఏమీ లేవని చెబుతూనే చంద్రబాబు అంటే గౌరవం ఉందని పవన్ అన్నారు.
వైసిపి అధికారంలోకి రాకూడదని, తప్పని పరిస్థితుల్లో టిడిపి వైపు చూడాల్సి వచ్చిందని, పరోక్షంగా పవన్ వ్యాఖ్యానించారు.
పవన్ పొత్తుల అంశంలో మాట్లాడిన తీరును చూస్తే ఇక బిజెపితో కలిసి ముందుకు వెళ్లలేమని ఎప్పుడో ఒకప్పుడు తెగ తెంపులు చేసుకోక తప్పదనే విషయాన్ని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఏపీలో బిజెపి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లేందుకైనా సిద్ధపడాలి, లేదంటే టీడీపీ జనసేన కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది.అయితే ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు ( Somu veerraju ) తో పాటు, కేంద్ర బిజెపి పెద్దలు టిడిపి తో పొత్తు పెట్టుకునేందుకు ఏమాత్రం ఆసక్తిగా లేరు.