డైరెక్టర్ రాజమౌళి సినిమాలు అంటే ఇప్పుడు దేశం అంత చాలా క్రేజ్ ఉంది కాబట్టి ఆయన సినిమాల్లో నటించే ఆర్టిస్టులు చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి ఎందుకంటే ఆయన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన కూడా మంచి గుర్తింపు వస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.అలాంటిది ఆయన చేసిన శాంతినివాసం సీరియల్ నుంచి మొన్న చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు ఆయన సినిమాలో కొంత మంది నటులు రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఎవరంటే…
నటుడు శేఖర్ రాజమౌళి తీసిన శాంతి నివాసం సీరియల్ నుంచి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు ఆయన తీసిన అన్ని సినిమాల్లో మనకు కనిపిస్తారు ఈయన అనే కాదు రాజీవ్ కనకాల, సమీర్ లాంటి నటులు కూడా రాజమౌళి తీసిన సినిమాల్లో మనకు తరుచుగా కనిపిస్తారు…
అయితే శేఖర్ పేరు కూడా ఛత్రపతి శేఖర్ గా మారిపోయింది ఎందుకంటే ఛత్రపతి సినిమాలో ఆయన చేసిన భద్రం క్యారెక్టర్ చాలా పాపులర్ అయిందనే చెప్పాలి… దాంతో ఆయన్ని అప్పటి నుంచి ఛత్రపతి శేఖర్ అంటూ ఉంటారు నటుడు అజయ్ కూడా రాజమౌళి సినిమాలో ఎక్కువ గా కనిపిస్తూ ఉంటారు… వీళ్ళందరూ కొన్ని సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ శేఖర్ మాత్రం రాజమౌళి అన్ని సినిమాల్లో చేశారు కనీసం ఒక చిన్న క్యారెక్టర్ అయిన రాజమౌళి ఆయన కోసం రాసుకుంటారు అయితే వీళ్లిద్దరి మద్య అంత ఫ్రెండ్షిప్ కి కారణం ఏంటంటే అది శేఖర్ యొక్క మంచితనం మాత్రమే అని చెప్పాలి…