నిక్కీ హేలీ… ఇపుడు సాధారణ, సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తున్న ఓ పేరు.అమెరికాలో రిపబ్లిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న నిక్కీ హేలీ వరుసగా పాక్ పైన తన ప్రతాపాన్ని చూపించారు.
అమెరికా ఏమైనా ప్రపంచ ఏటీఎంలాగా కనబడుతుందా? అని ప్రశ్నలు సంధించారు.తాను అధికారంలోకి వస్తే చైనా, పాకిస్థాన్ తదితర శత్రు దేశాల అంతు చూస్తానని చెప్పకనే చెప్పారు.
అవును, ఆయా దేశాలకు నిధులు అందించడాన్ని పూర్తిగా నిలిపివేస్తానని నిక్కీ హేలీ కొద్ది రోజుల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ ప్రచారం ముమ్మురంగా సాగుతోంది.ఈ నేపథ్యంలో ఆమె వరుసగా పాక్ పైన తనకున్న కోపాన్ని ప్రదర్శిస్తున్నారు.అంతేకాదు, అది దేశ ప్రజల కోపం అని అంటున్నారు.
అమెరికా బలహీనంగా చెడ్డ దేశాలకు ముడుపులు చెల్లిస్తోందని వ్యాఖ్యానించారు.తాను అధికారంలోకి వస్తే ఇలాంటివి జరగవని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
గతేడాది కూడా అమెరికా… పాకిస్థాన్ ఇరాక్ జింబాబ్వేలకు వందల మిలియన్ల డాలర్ల సాయం చేసిందని నిక్కీ హేలీ ఈ విషయమై గుర్తు చేశారు.
తాను అధికారంలోకి వస్తే మాత్రం అమెరికాను వ్యతిరేకించే దేశాలకు ఎన్నడూ సాయం చేయబోనని, పాక్ లాంటి చెడ్డ దేశాలకు అయితే వందల మిలియన్ల డాలర్లు అయితే అస్సలు ఇవ్వనని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.కాగా ఈ మాటలు అమెరికన్ జనాలను మెప్పిస్తాయా? అనే అనుమానం ప్రత్యర్ధులు వెళ్లబుచ్చుతున్నారు.ఇలాంటి మాటలవలన విరిగేదేమి లేదని వారు అంటున్నారు.
అయితే ఆమె ధోరణి మాత్రం ఏమాత్రం మార్చుకోవడం లేదు.అమెరికా ప్రపంచ ఏటీఎం ఏమీ కాదని తాజాగా ఆమె ట్వీట్ చేయడం ఇపుడు US రాజకీయంలో మెల్లగా వేడి పుట్టిస్తోందని చెప్పుకోవాలి.