మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ మరోసారి కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకానున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ కార్యాలయానికి ఎంపీ అవినాశ్ రెడ్డి రానున్నారు.ఈ నేపథ్యంలో హత్యకు సంబంధించి పలు కీలక అంశాలపై అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు.రూ.40 కోట్ల డీల్ పై సీబీఐ ఆరా తీయనుంది.కాగా వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ అయిన తర్వాత అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు రావడం ఇది రెండోసారి.అయితే ఈ కేసులో అవినాశ్ పాత్ర కీలకంగా ఉందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సునీల్ యాదవ్ బెయిల్ కౌంటర్ లో సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది.హత్య జరిగిన రోజు నిందితులు అంతా భాస్కర్ రెడ్డి ఇంటిలోనే ఉన్నారని సీబీఐ ఆరోపిస్తుంది.
ఈ విషయాన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా స్పష్టం చేసిందని వెల్లడించింది.ఆధారాలను చెరిపేయడంలో అవినాశ్ పాత్ర ఉందని సీబీఐ చెబుతోంది.
దీంతో ఇవాళ్టి విచారణ అనంతరం కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది.