హాలీవుడ్ రేంజ్ లో బ్యాంక్ దోపిడీకి యత్నించిన యువకుడు.. దేశ రాజధానిలో కలకలం..!

ఇటీవలే కాలంలో కొంతమంది వ్యక్తులు చాలా సులువుగా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుక్కుంటున్నారు.అందుకోసం దారుణాలు, దోపిడీలు, మోసాలు చేయడంలో ఒకరిని మించి ఒకరు సమాజంలో తయారవుతూనే ఉన్నారు.

 Inspired By Movie Man Attempts Bank Robbery In Delhi Details, Inspired By Movie,-TeluguStop.com

మరొకపక్క భారీ దోపిడీలు, రా ఏజెంట్ల రూపంలో వచ్చిన అన్ని భారతీయ సినిమాలు మంచి విజయాలను సాధించాయి.ఈ సినిమాలు చూసిన కొందరు తెరపై చూపించిన ప్లాన్లను తెర వెనుక కూడా అమలు పరచాలని సరికొత్త ప్లాన్లు వేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.

ఇలాంటి ఒక ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుని కలకలం రేపింది.సినిమాకు జీవితానికి మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది.

సినిమా అనేది వినోదం చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.హీరోలా ఫీల్ అయిపోయి నిజ జీవితంలో సినిమా సన్నివేశాలను ఆదర్శంగా తీసుకొని మోసాలకు పాల్పడితే చివరికి కటకటాల పాలు కావాల్సిందే.

దేశ రాజధాని ఢిల్లీలోని కరావల్ నగర్లో నివాసం ఉండే ఇమ్రాన్ అలియాస్ రాజా అనే యువకుడు ఓ వస్త్ర కంపెనీలో టైలర్ గా పని చేస్తున్నాడు.యజమానితో గొడవ కారణంగా బయటకు వచ్చేసిన ఇమ్రాన్ అదే రోజు స్థానిక ప్రైవేట్ బ్యాంకులో దోపిడీకి యత్నించాడు.

Telugu Allahabad, Bank, Bank Robbery, Delhi, Gun, Imran Aka Raja, Inspired, Priv

ఫిబ్రవరి 21న బ్యాంకు లోపలికి చొరబడి తుపాకీతో ఐదుసార్లు గాల్లోకి కాల్పులు జరిపాడు.ఇక బ్యాంకు సిబ్బందితోపాటు కస్టమర్లు కూడా భయాందోళనకు గురయ్యారు.అక్కడ జరుగుతున్న సంఘటన గస్తీలో ఉన్న పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకొని అలహాబాద్ కు చెందిన ఇమ్రాన్ గా గుర్తించారు.పోలీసుల విచారణలో ఆసక్తికర వ్యాఖ్యలు బయటపడ్డాయి.

Telugu Allahabad, Bank, Bank Robbery, Delhi, Gun, Imran Aka Raja, Inspired, Priv

హాలీవుడ్ లో వచ్చిన ”ది సీక్రెట్ ఏజెంట్ ” సినిమా చూసిన ఇమ్రాన్ అదే తరహాలో బ్యాంకు దోపిడీకి యత్నించినట్లు తెలిపాడు.ఇక తుపాకితో బ్యాంకు సిబ్బందిని బెదిరించి కేవలం కోటి రూపాయలను దోచుకోవడం కోసమే ఇలా చేశానని ఒప్పుకున్నాడు.తన వద్ద ఉన్న తుపాకీ గురించి ప్రశ్నించగా రెండు సంవత్సరాల క్రితం యమునా నది తీరా ఒడ్డులో దొరికిందని అప్పటినుండి తన దగ్గరే పెట్టుకున్నట్లు పోలీసులకు చెప్పాడు.ఆ తుపాకిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube