అదృష్టం వరించి రూ.16 వేల కోట్ల లాటరీ.. ఏ దేశంలో అంటే

ఎవరికైనా రోడ్డుపై రూ.100 నోటు దొరికితే చాలా సంతోషం కలుగుతుంది.అందులోనూ రూ.లక్ష లాటరీ తగిలితే ఆ వ్యక్తి ఆనందం పట్టలేడు.అయితే ఓ వ్యక్తి లక్షలు, కోట్లకు మించి భారీ లాటరీ తగిలింది.అదృష్టం వరించి ఏకంగా రూ.16 వేల కోట్ల లాటరీ వరించింది.మీరు వింటున్నది నిజమే.

 Man Won 16886 Crores Power Ball Jackpot Lottery In California Usa Details, Luck,-TeluguStop.com

అది అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది.ఫిబ్రవరి 14న కాలిఫోర్నియాలో 2.04 బిలియన్ డాలర్లు లేదా రూ.16,886 కోట్లను ఓ వ్యక్తి లాటరీలో గెలుచుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.కాలిఫోర్నియా లాటరీ ప్రకారం లాటరీ గెలుచుకున్న వ్యక్తి పేరు ఎడ్విన్ కాస్ట్రో. ఈ వ్యక్తి చరిత్రలో అతిపెద్ద లాటరీ జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు.

Telugu Lakhs, Lottery, Calinia, Edwin Castro, Luck, Jackpot, Latest-Telugu NRI

ఆ మొత్తాన్ని ఒకే సారి తీసుకోవాలంటే కేవలం రూ.8,227 కోట్లు మాత్రమే ఇస్తారు.అలా తనకు దక్కిన మొత్తాన్ని ఎడ్విన్ కాస్ట్రో పొందాడు.మల్టీ-స్టేట్ లాటరీ అసోసియేషన్ ప్రకారం, 29.22 కోట్ల మంది ప్రజలలో ఒకరు పవర్‌బాల్ జాక్‌పాట్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.ఎడ్విన్ కాస్ట్రోకి ఆ లాటరీ దక్కించుకునే అవకాశం లభించింది.

నవంబర్ ప్రారంభంలో, కాస్ట్రో కాలిఫోర్నియాలోని అల్టాడెనాలో లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు.ఇటీవల తీసిన లాటరీ నంబరుకు, అతడు కొన్న లాటరీ టికెట్ సరిపోయింది.

అయితే లాటరీ దక్కించుకున్న వ్యక్తి పేరు మాత్రమే బయటకు వెల్లడించారు.ఇతర వివరాలను బయట పెట్టలేదు.

Telugu Lakhs, Lottery, Calinia, Edwin Castro, Luck, Jackpot, Latest-Telugu NRI

ఆ వ్యక్తి చెప్పడంతోనే ఇలా చేసినట్లు లాటరీ నిర్వాహకులు వెల్లడించారు.లాటరీలో రూ.8.227 కోట్లను మాత్రమే విజేతకు ఇచ్చారు.మిగిలి మొత్తంలో ప్రభుత్వ పాఠశాలలకు ఖర్చు చేయనున్నారు.ఫలితంగా కాలిఫోర్నియాలోని ప్రభుత్వ పాఠశాలలకు రూ.1,292 కోట్లను అందుబాటులో ఉంచారు.1985లో ప్రారంభమైనప్పటి నుండి, కాలిఫోర్నియా లాటరీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు 41 బిలియన్ డాలర్లకు పైగా విరాళం ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube