వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు.ఏపీకి సీఎం జగనా… లేక సజ్జలనా అని ప్రశ్నించారు.
విజయమ్మ ఓటమి కోసం పని చేశారని జగన్ కు బాబాయ్ అంటే కోపమని అయ్యన్న ఆరోపించారు.కొడాలి నాని ఇదే విషయాన్ని చెప్పారన్నారు.
రక్తపు మడుగులో ఉంటే విజయసాయిరెడ్డి గుండెపోటని ఎలా చెప్పారని నిలదీశారు.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విజయాసాయిరెడ్డిని అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా రాజధాని విషయంలోనూ గందరగోళ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.విశాఖ రాజధానిగా ఏ చట్టం ప్రకారం పెడతారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.