ఏపీ రాజకీయాలు బాగా హీట్ ఎక్కాయి.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది , అసంతృప్త నాయకులు తెరపైకి వస్తున్నారు.
ఇక కులాల వారీగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారుతున్న కాపు సామాజిక వర్గం లో ఈ అలజడి మొదలైంది.
రాబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తు పెట్టుకునే ఆలోచనతో ఉండడంతో, వైసిపి ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.గత కొద్దిరోజులుగా కాపు సంక్షేమ సంఘం నేత హరి రామ జోగయ్య, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య కొద్దిరోజులుగా లేఖల యుద్ధం కొనసాగుతోంది.
మంత్రి అమర్నాథ్ ను ఉద్దేశించి జోగయ్య లేఖ రాస్తూ.నువ్వు రాజకీయాల్లో బచ్చావి అంటూ ఘాటు పదజాలంతో లేఖ రాయగా, అమర్నాథ్ కూడా జోగయ్యకు గట్టిగానే కౌంటర్ ఇస్తూ లేఖ రాశారు.
ఇక అప్పటి నుంచి వరుస, వరుసగా ఇద్దరు మధ్య లేఖల యుద్ధం కొనసాగుతూనే ఉంది.మంత్రి అమర్నాథ్ కు మద్దతుగా కొంతమంది కాపు నాయకులు మాట్లాడుతూ ఉండగా, జోగయ్య ను సమర్థిస్తూ జనసేన తో పాటు, కాపు సంఘం నాయకులు కొంతమంది స్పందిస్తున్నారు.
వంగవీటి రంగా ను చంపింది టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే అంటూ గతంలో జోగయ్య రాసిన పుస్తకాన్ని ప్రస్తావిస్తూ మంత్రి అమర్నాథ్ జోగయ్య ను పదే పదే ప్రశ్నిస్తున్నారు.
టిడిపి జనసేన మధ్య పొత్తును ఎలా సమర్థిస్తున్నారని రంగా హత్యను అమర్నాథ్ ప్రస్తావిస్తున్నారు.దీని పైన జోగయ్య తాజాగా స్పందించారు.బలవంతుడిని తప్పించడానికి సాయం తీసుకోవడం తప్పు కాదంటూ జోగయ్య అమర్నాథ్ ను ఉద్దేశించి లేక రాశారు.ఇక తనకు ఉత్తరాల మీద ఉత్తరాలు అనవసరంగా రాసి నా ఓపికను పరీక్షించవద్దు అంటూ జోగయ్య హెచ్చరిస్తున్నారు .‘ నన్ను రెచ్చగొట్టడం ద్వారా లాభపడాలని ప్రయత్నించకు.నేను చెప్పిన దాంట్లో సత్యం ఎంతో ఆలోచించు, అధికారంలో ఉన్నప్పుడు సాధ్యపడకపోయినా, చివరి దశలోనైనా కాపుల సంక్షేమం కోరి ఈ కార్యక్రమానికి తలపడ్డాను.
కాపులకు రిజర్వేషన్లు కల్పించడం నా మొదటి లక్ష్యం అయితే , బడుగు బలహీన వర్గాలకు అధికారం దక్కాలి అన్నది రెండవ లక్ష్యం.అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో రెండు కులాలే అధికారం చేపడుతున్నాయి.ఈ దౌర్భాగ్యస్థితి నుండి రాష్ట్రాన్ని కాపాడాలని నా ఆకాంక్ష.
నాకు కుల పిచ్చి కాదు రాజ్యాధికారం దక్కించుకోవడానికి బలవంతుడిని తప్పించడానికి మరొక సహాయం తీసుకోవడం తప్పుకాదని నా దృఢ సంకల్పం ‘ అంటూ అమర్నాథ్ ను ఉద్దేశించి జోగయ్య తాజాగా లేఖ రాశారు.దీనికి మరో కౌంటర్ ఇచ్చేందుకు మంత్రి అమర్నాథ్ సిద్ధమవుతున్నారు.
ఈ విధంగా ‘ కాపు ‘ ల అంశంపై ఒకరిపై ఒకరు లేఖలు ఆ సామాజిక వర్గం మద్దతు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.