ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వట్టి వసంత కుమార్ మృతి చెందారు.70 సంవత్సరాలు వయసు కలిగిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు.ఈ క్రమంలో విశాఖపట్నంలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించటంతో తుది శ్వాస విడవటం జరిగింది.ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల. 2004 మరియు 2009 ఎన్నికలలో ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2009లో వైయస్ క్యాబినెట్ లో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.వైయస్ మరణించాక రోశయ్య ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో కూడా మంత్రిగా పనిచేయడం జరిగింది.కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది.2014 ఎన్నికల తర్వాత రాజకీయాల నుండి దాదాపు దూరమయ్యారు.ఈ క్రమంలో వసంత కుమార్ భౌతికకాయాన్ని విశాఖ నుంచి ఆయన స్వగ్రామానికి తరలించి అక్కడే అంతిక్రియలు నిర్వహించనున్నారు.
వసంత కుమార్ మరణ వార్త విని పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.