సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సందర్భాలలో సెలబ్రిటీలు మాట్లాడే మాటలు కాస్త తప్పుగా ఉన్నాయంటే వెంటనే వారిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఆడియో ఫంక్షన్ లలో నోరు జారి తప్పుగా మాట్లాడడంతో వారిపై ట్రోలింగ్స్ జరిగిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ ట్రోలింగ్స్ ను టాలీవుడ్ కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.తాజాగా ఒక అమెరికన్ నటి కూడా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ కి గురైంది.
ఒక చిన్న కన్ఫ్యూజన్ వల్ల ఆమె దారుణమైన ట్రోలింగ్స్ ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఆమె మరెవరో కాదు అమెరికన్ నటి జేన్ ఫాండా. తాజాగా ఆమె ఆర్ఆర్ఆర్ సినిమాపై చేసిన కామెంట్ తో ట్రోలింగ్ బారిన పడింది.అసలేం జరిగిందంటే.
నటి జేన్ ఫాండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.నేను చివరగా సిఫార్సు చేసిన టు లెస్లీ సినిమాకు పూర్తి విరుద్ధంగా ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమాను రికమెండ్ చేస్తున్నాను.
ఈ సినిమా నన్ను ఆశ్చర్యపరిచింది.ఈ భారతీయ సినిమా బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ క్యాటగిరిలో షార్ట్ లిస్ట్ అయింది.ఇది ఇండియానా జోన్స్ సామ్రాజ్యవాదం బాలీవుడ్ కాంబినేషన్.ఈ సినిమా నాలో సరికొత్త మార్పును తీసుకువచ్చింది అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.ఆర్ఆర్ఆర్ సినిమాను టాలీవుడ్ సినిమా అని కాకుండా బాలీవుడ్ సినిమా అని సిఫార్సు చేసింది.దీంతో ఆ ఒక్క కామెంట్ ని పట్టుకున్న నెటిజన్స్ ఆమెపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా బాలీవుడ్ సినిమా కాదని టాలీవుడ్ సినిమా అంటూ ఆమెకు హితబోధ చేసున్నారు.ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వస్తే.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.ఈ సినిమా విడుదల అయి కొన్ని నెలలు పూర్తి కావస్తున్నా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదు.
రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.