సాధారణంగా ముఖ చర్మంపై ఎప్పటికప్పుడు డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోతూ ఉంటాయి.పెరిగిన కాలుష్యం, ఎండల ప్రభావం, చర్మ సంరక్షణ లేకపోవడం తదితర అంశాల కారణంగా చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ ఏర్పడుతుంటాయి.
డెడ్ స్కిన్ సెల్స్ ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు.ఒకవేళ వాటిని తొలగించకుండా ఉంటే ముఖ చర్మం నిర్జీవంగా, డల్ గా మారుతుంది.
అలాగే ముఖంలో కాంతి మరియు చర్మ ఛాయ సైతం తగ్గుతుంది.అందుకే చర్మాన్ని తరచూ స్క్రబ్బింగ్ చేసుకుంటూ ఉండాలి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ న్యాచురల్ స్క్రబ్ ను ట్రై చేస్తే సులభంగా మరియు వేగంగా డెడ్ స్కిన్ సెల్స్ ను వదిలించుకోవచ్చు.క్షణాల్లో ముఖాన్ని తెల్లగా మృదువుగా కూడా మెరిపించుకోవచ్చు.
మరి ఇంతకీ ఆ న్యాచురల్ స్క్రబ్ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక అలోవెరా ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసి సైడ్స్ ను తొలగించాలి.ఇలా సైడ్స్ ను తొలగించిన అలోవెరాను మధ్యలోకి కట్ చేసుకోవాలి.ఇలా కట్ చేసుకున్న అలోవెరా పీస్ పై వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ చందనపు పొడి, వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి ముఖ చర్మం పై స్మూత్ గా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ న్యాచురల్ స్క్రబ్ ను ప్రయత్నించడం వల్ల చర్మం పై పేరుకు పోయిన మురికి, మృత కణాలు సులభంగా తొలగిపోతాయి.చర్మం క్షణాల్లో తెల్లగా మృదువుగా మారుతుంది.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.జిడ్డు జిడ్డుగా ఉన్న చర్మం తాజాగా, గ్లోయింగ్ గా సైతం మారుతుంది.కాబట్టి, ముఖం నిర్జీవంగా కాంతిహీనంగా ఉన్నప్పుడు తప్పకుండా ఈ న్యాచురల్ స్క్రబ్ ను ట్రై చేయండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.