టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు ఆ సినిమాకు సొంతం అయ్యాయి.
ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి మరియు ఆర్‌ఆర్ ఆర్ సినిమా యొక్క రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ సినిమా కు సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నాడు.ఆ సీక్వెల్ ఎప్పుడు ఉంటుంది.
ఎలా ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు.
మరో వైపు రాజమౌళి కూడా ఒక ఇంటర్వ్యూ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా కు సీక్వెల్ చేస్తాను అని.ఇప్పటికే ఒక స్టోరీ లైన్ ను నాన్న గారు రెడీ చేశాడు అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది.మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ సినిమా యొక్క సీక్వెల్ ను తీసే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
మరో వైపు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య బాహుబలి సినిమా కు కూడా సీక్వెల్ తీస్తాం అన్నట్లుగా పేర్కొన్నారు.కానీ అది నిజం కాలేదు.
బాహుబలి సీక్వెల్ గురించి ఎంతగా ప్రచారం జరిగిందో అందరికి తెల్సిందే.
గతంలో బాహుబలి సీక్వెల్ కు వచ్చిన ఫేక్ న్యూస్ మాదిరిగానే ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమా యొక్క సీక్వెల్ వార్తలు అనిపిస్తున్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ సమయంలో సినిమా యొక్క పబ్లిసిటీ కోసం మాత్రమే రాజమౌళి సీక్వెల్ అనే ప్రచారం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క సినిమా కు ఆయన సీక్వెల్ చేసే ఆలోచనలో లేడు అనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.రాజమౌళి దర్శకత్వంలో త్వరలో మహేష్ బాబు మూవీ పట్టాలెక్కబోతుంది.
ఆ తర్వాత ఏ సినిమా ను ఆయన చేస్తాడు అనేది చూడాలి.