పర్సు ఎక్కడో పెట్టి మర్చిపోయారా.. అద్భుత పరిష్కారం చూపే డివైజ్

చాలా మందికి పర్సు ఎక్కడో పెట్టి మర్చిపోవడం అలవాటు.పర్సులోనే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, క్యాష్ ఇలాంటివి ఎన్నో నిత్యం అవసరమైనవి పెట్టుకుంటుంటాం.

 Trova Go Plus Smart Pouch Can Lock Your Things Safely Details, Purse,viral Lates-TeluguStop.com

అలాంటిది ఇంట్లోనో, ఆఫీసులోనే లేదా బయటికి వెళ్లిన సందర్భాలలో పర్సు మర్చిపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి కూడా అందులోనే పెట్టుకుంటారు.

అలాంటివి పోతే తిరిగి పొందేందుకు ఇబ్బంది పడతారు.

ఒక్కోసారి క్యాష్ కూడా అందులోనే పెట్టడంతో ఏదైనా పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు సమస్య ఉంటాయి.

దీనికి సంబంధించిన ఒకే ‘ట్రోవా’ సంస్థ అద్భుతమైన పరిష్కారం కనిపెట్టింది.ట్రోవా సంస్థ ‘ట్రోవా గోప్లస్‌’ పేరుతో సరికొత్త స్మార్ట్ పౌచ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

డబ్బులు, వాచ్, పెన్‌డ్రైవ్ వంటివి పెట్టుకోవచ్చు.దీనిని మనం మన ఫోన్‌లోని యాప్‌కి కనెక్ట్ చేసుకునే సౌలభ్యం ఉంది.

మీ అరచేతిలో ఉంచే వ్యక్తిగత, పోర్టబుల్ బయోమెట్రిక్ స్మార్ట్ సేఫ్.స్మార్ట్ టెక్నాలజీతో కూడిన మా స్టైలిష్ అల్యూమినియం అల్లాయ్ పరికరం, మీరు ఎక్కడికి వెళ్లినా మీ వస్తువులను సురక్షితంగా లాక్ చేసి ఉంచుతుంది.TROVA GO PLUS పెద్ద వాచీలు, క్యాష్ రోల్స్ లేదా ఎక్కువ కెపాసిటీ అవసరమయ్యే భారీ వస్తువుల కోసం ఖచ్చితంగా సరిపోతుంది.మీ వస్తువులు గట్టిగా మూసివున్న,

వాసనను దాచిపెట్టే పాకెట్-సైజ్ సేఫ్‌లో భద్రపరచబడ్డాయని తెలుసుకుని విశ్రాంతి తీసుకోండి.దీనికి స్మార్ట్ లాక్ ఉంటుంది.ఫలితంగా దీనిని అపరిచితులు ఓపెన్ చేయాలంటే సాధ్య పడదు.

పొరపాటున దీనిని ఎక్కడ మర్చిపోయినా, పోగొట్టుకున్నా చింతించాల్సిన పని లేదు.జీపీఎస్ సాయంతో అది ఎక్కడ ఉందో కనిపెట్టే వీలుంటుంది.దీని ధర రూ.20,600గా నిర్ణయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube