ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.కాపు రిజర్వేషన్ ల కోసం ఇటీవల నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్న మాజీమంత్రి హరిరామజోగయ్య పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఈ వయసులో దీక్షలు అవసరమా అని వ్యాఖ్యానించారు.మీకు కావాల్సింది రిజర్వేషన్ లా? లేకపోతే రాజ్యాధికారమా? అని ప్రశ్నించారు.పోరాడాలనుకుంటే నాతో కలిసి అడుగులు వేయండి అని పిలుపునిచ్చారు.చంద్రబాబుతో సహా అనేక మందిని ముఖ్యమంత్రులుగా తానే చేసినట్లు కేఏ పాల్ చెప్పుకొచ్చారు.
చంద్రబాబు కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లపై సభలు మరియు ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించడం జరిగిందని వ్యాఖ్యానించారు.చంద్రబాబుకి బ్రెయిన్ పనిచేయడం లేదు.
కందుకూరిలో 8 మంది చనిపోతే.కావలిలో మరో సభ ఎలా పెడతారు.? అని ప్రశ్నించడం జరిగింది.యూజ్లెస్ ఫెలోస్, ఎన్టీఆర్ కూడా చంద్రబాబు చేతిలో మోసపోయాడు.
నేను కూడా మోసపోయాను.స్వార్థ రాజకీయాల కోసమే గుంటూరులో సభ నిర్వహించారు అంటూ గుంటూరు ఘటనపై.
కేఏ పాల్ మండిపడ్డారు.