రంగారెడ్డి జిల్లా నార్సింగ్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో డిటోనేటర్ పేలిన ఘటన కలకలం సృష్టించింది.పేలుడు ధాటికి బండరాళ్లు ఆకాశంలోకి ఎగిరిపడ్డారు.
ఈ నేపథ్యంలో పేలుడు శబ్ధానికి తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు.ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
రోడ్డు పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ మూడు రోజుల క్రితం డిటోనేటర్లు అమర్చారని తెలుస్తోంది.అందులో ఒక డిటోనేటర్ ఇవాళ ఆకస్మాతుగా పేలింది.
ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించారు.
వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.