స్ఫూర్తిదాయ‌క పారిశ్రామిక దిగ్గ‌జాలను క‌నుమ‌రుగు చేసిన 2022

2022 సంవత్సరం గడ‌చిపోతుంది.కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది.

 Entrepreneurs Who Died In 2022 Rahul Bajaj Rakesh Jhunjhunwala Cyrus Mistry Deta-TeluguStop.com

భారత‌ కార్పొరేట్ రంగానికి ఈ సంవత్సరం ఇప్పటివరకు చెడునే మిగిల్చింది.భారీ పెట్టుబడులు లేదా ఒప్పందాల గురించి ప‌క్క‌న పెడితే ఈ సంవత్సరంలో ఐదుగురు భారతీయ పారిశ్రామికవేత్తలు క‌న్నుమూశారు.

ఇది మొత్తం పరిశ్రమకు తీర‌ని నష్టం.వీరిలో బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా నుండి రాహుల్ బజాజ్ వంటి పారిశ్రామికవేత్తలు వ‌ర‌కూ ఉన్నారు.

రాహుల్ బజాజ్ (మరణం: 12 ఫిబ్రవరి 2022)

Telugu Cyrus Mistry, Entrepreneurs, Pallonji Mistry, Rahul Bajaj-Latest News - T

2022 సంవత్సరం ప్రారంభంలో 12 ఫిబ్రవరి 2022న బజాజ్ గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్ రాహుల్ బజాజ్ మరణంతో భారతీయ కార్పొరేట్ రంగానికి మొదటి దుర్వార్త వినిపించింది.రాహుల్ బ‌జాజ్‌ న్యుమోనియాతో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ మ‌ర‌ణించారు.

పల్లోంజి మిస్త్రీ (మరణం: 28 జూన్ 2022)

Telugu Cyrus Mistry, Entrepreneurs, Pallonji Mistry, Rahul Bajaj-Latest News - T

నిర్మాణ రంగంలో అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు చైర్మన్‌గా వ్య‌వ‌హ‌రించిన‌ పల్లోంజీ మిస్త్రీ కూడా ఈ ఏడాది పంచతత్వాల‌లో విలీనమయ్యారు.ప‌ల్లోంజీ మిస్త్రీ భారతదేశపు బిలియనీర్‌గా పేరుగాంచారు.ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త ఐరిష్ మహిళను వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత ప‌ల్లోంజీ ఐర్లాండ్ పౌరసత్వం పొందారు.అయితే దీని తరువాత కూడా అతను ముంబైలోని వక్స్వార్‌లోని సముద్రతీర బంగ్లాలో ఎక్కువ కాలం గ‌డిపారు.పల్లోంజీ ఇక్కడే మరణించారు.

రాకేష్ ఝున్‌జున్‌వాలా (మరణం: 14 ఆగస్టు 2022)

Telugu Cyrus Mistry, Entrepreneurs, Pallonji Mistry, Rahul Bajaj-Latest News - T

భారత స్టాక్ మార్కెట్‌లో ప్రముఖ పెట్టుబడిదారు అయిన రాకేష్ ఝున్‌జున్‌వాలా ఈ ఏడాది ఆగస్టులో 62 ఏళ్ల వయసులో మరణించారు.బిగ్‌బుల్‌గా పేరు తెచ్చుకున్నారు.1985 సంవత్సరంలో స్టాక్ మార్కెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఝున్‌జున్‌వాలా మార్కెట్ ఎప్పుడూ భవిష్యత్తును చూస్తుందని చెప్పేవారు.స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన పెట్టుబడిదారులకు రాకేష్ ఝున్‌జున్‌వాలా ఒక ఉదాహరణగా నిలిచారు.వేల కోట్ల ఆస్తిని సంపాదించారు.

సైరస్ మిస్త్రీ (మరణం: 4 సెప్టెంబర్ 2022)

Telugu Cyrus Mistry, Entrepreneurs, Pallonji Mistry, Rahul Bajaj-Latest News - T

పల్లోంజీ షాపూర్జీ కుటుంబానికి 2022 సంవత్సరం అత్యంత బాధారంగా మిగిలింది.పల్లోంజి మిస్త్రీ జూన్ మొదటి నెలలో మరణించారు.వారి కుటుంబం ఈ బాధ నుండి కోలుకోకుండానే సెప్టెంబర్ మాసంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించారు.

గుజరాత్ నుంచి తిరిగి వస్తుండగా మహారాష్ట్రకు స‌మీపంలో ఉన్న పాల్ఘర్‌లో ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్ర‌మాదంలో ఆయ‌న‌ ప్రాణాలు కోల్పోయారు.

సైరస్ మిస్త్రీ పిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా పేరు గ‌డించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube