మీరు ఆదాయపు పన్ను విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా? అయితే ఇకనుండి జాగ్రత్తగా వ్యహరించాలి.లేదంటే నోటీసులతో పాటు భారీ జరిమానా కట్టుకోవలసిన పరిస్థితి ఉంటుంది.
అందుకే బేసిక్ ఆదాయపు పన్ను పన్ను శాఖ నియమ నిబంధనలు లాంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే ఈ సమాచారం ఖచ్చితంగా మీ కోసమే.మీ ఆదాయం 2.5 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే మీరు తప్పనిసరిగా ఆదాయపు పన్ను చెల్లించి తీరాల్సిందే.
ఇక 5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న పౌరులు ITR ఫైల్ చేయడం తప్పనిసరి.కాగా ఈ సంవత్సరం జూలై 30లోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి వుంది.
అయితే దానిని తాజాగా పొడిగించడం జరిగిందని మీకు తెలుసా? కాగా ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, ఈ గడువులోపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకునే అవకాశం ఎక్కువగా వుంది.ఆలస్యంగా ITR ఫైల్ చేయడానికి ఒక ఆప్షన్ అనేది వుంది.
ఇక ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2022 అని గుర్తుపెట్టుకోండి.
30 జూలై 2022 వరకు ITR ఫైల్ చేయలేని పన్ను చెల్లింపుదారులు, ఆగస్ట్ 1 నుండి డిసెంబర్ 31 వరకు జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగా ITR ఫైల్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పించింది.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139 (5) ప్రకారం, పన్ను చెల్లింపుదారులకు ITR అప్‌డేట్, ఆలస్యమైన ITR ఫైల్ చేసే అవకాశం ఇచ్చింది.ఈ గడువులోపు అప్‌డేట్ చేయబడిన ITRని ఫైల్ చేయలేని పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను నోటీసులను ఎదుర్కొవచ్చు, అలాగే భారీ జరిమానాలు కూడా చెల్లించవలసి రావలసి ఉంటుంది.
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234F కింద సూచించిన జరిమానా పన్ను చెల్లింపుదారుల నుండి ఆలస్యంగా ITR దాఖలు చేయబడుతుంది.