చిరంజీవి కూతురు శ్రీజకు సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ల రేంజ్ లో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.శ్రీజ గురించి ఈ మధ్య కాలంలో వేర్వేరు వార్తలు వినిపిస్తున్నా వాటి గురించి ఆమె అస్సలు రియాక్ట్ కావడం లేదు.
అయితే గతంలోఒక ఇంటర్వ్యూలో శ్రీజ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నా పిల్లలు నేను చెప్పిన దారిలోనే వెళ్లాలని నాకేం లేదని ఆమె అన్నారు.
పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతానని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే విషయాలను మాత్రం చెబుతానని శ్రీజ చెప్పుకొచ్చారు.మా చిన్నపాప నవిష్క బాగా అల్లరి చేస్తుందని శ్రీజ కామెంట్లు చేశారు.
బాగా దూకేయడం లాంటి పనులు చేస్తుందని ఆమె పేర్కొన్నారు.నివృతి కామ్ గా ఉంటుందని అల్లరి చేయమన్నా చేయదని శ్రీజ పేర్కొన్నారు.
పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పులు చేయవద్దని మాత్రమే నేను సూచిస్తానని శ్రీజ పేర్కొన్నారు.
సాధారణంగా ఎక్కువగా గారాబం చేస్తే పిల్లలు చెడిపోతారని ఆమె పేర్కొన్నారు.
ఆ ప్రభావం పిల్లలు పెద్దయ్యాక తెలుస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.నాన్న గారాబంగా పెంచినా పెద్దలను గౌరవించాలని, క్రమశిక్షణతో మెలగాలని నేర్పించారని శ్రీజ అన్నారు.
మేము పెరిగే సమయంలో నాన్న చాలా బిజీగా ఉండేవారని ఆమె కామెంట్లు చేశారు.కుటుంబ విలువల గురించి నాన్న ఎప్పుడూ చెప్పేవారని శ్రీజ వెల్లడించారు.
డాడీకి నేను బాగా క్లోజ్ అని చిరంజీవి చిన్నకూతురు పేర్కొన్నారు.నాకు ఏ సమస్య ఉన్నా అమ్మ చూసుకుంటుందని శ్రీజ తెలిపారు.అమ్మ చాలా కామ్ గా ఉంటుందని శ్రీజ అన్నారు.అమ్మ విన్నారంటే సగం సమస్య సాల్వ్ అయినట్టేనని ఆమె వెల్లడించారు.శ్రీజ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.