Ritu Varma: మొదట షార్ట్ ఫిలిం, ఆ తర్వాత హీరోయిన్ గా, రీతూ వర్మ కి లైఫ్ ఇచ్చింది ఎవరో తెలుసా ?

మీకు పెళ్లి చూపులు సినిమా గుర్తుండే ఉంటుంది.ఆ సినిమా విజయవంతం కావడం లో హీరో గా విజయ దేవరకొండ క్రెడిట్ ఎంత ఉంటుందో అదే స్థాయిలో హీరోయిన్ రీతూ వర్మ కి కూడా క్రెడిట్ ఇచ్చి తీరాలి.

 Who Is Behind Ritu Varma Craze Details, Ritu Varma , Heroine Ritu Varma, Directo-TeluguStop.com

ఆమె ఈ సినిమా ద్వారా యూత్ లో చాల ఫాలోయింగ్ పెంచుకుంది.రీతూ వర్మ వాస్తవానికి తెలుగు అమ్మాయి కాదు.

ఆమె సొంత ప్లేస్ మధ్య ప్రదేశ్. ఆమె తండ్రి ఒక బ్యాంక్ ఉద్యోగి కాగా తల్లి కాలేజ్ లో ప్రొఫెసర్.

తన తల్లి ప్రొఫెసర్ గా ఉన్న కాలేజ్ లోనే రీతూ వర్మ చదువుకుంది.ఆ తర్వాత బి టెక్ కోసం హైదరాబాద్ మల్ల రెడ్డి కాలేజ్ కి వచ్చింది.

అక్కడే మిస్ రోజ్ పోటీల్లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది.దాంతో రీతూ కి మోడలింగ్ పై ఇంట్రెస్ట్ వచ్చింది.

చదువు అయిపోయాక ఒక పెద్ద కంపెనీ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసింది.ఒక వైపు జాబ్ చేస్తూనే మరో వైపు మోడలింగ్ కోసం ట్రై చేసింది.

ఆలా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆమెకు పరిచయం అయ్యాడు.అతడు అప్పటికే డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ అందుకోసం ఒక షార్ట్ ఫిలిం తీయాలని అనుకుంటున్నాడు.

దాంట్లో హీరోయిన్ గా రీతూ ని అడిగితే ఆమె ఒప్పుకుంది.దాని పేరు “అనుకోకుండా”. కేవలం 48 గంటల్లో తీసిన ఈ షార్ట్ ఫిలిం బాగా హిట్ అవ్వడంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.దాంతో మొదటగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్‌షా.

చేసింది చిన్న పాత్రే అయినా ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ లో ఒక హీరోయిన్ గా అవకాశం కొట్టేసింది.

Telugu Tharun Bhaskar, Ritu Varma, Pelli Choopulu, Reethu Varma-Movie

ఆ తర్వాత నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాల్లో నటించింది.ఆలా ఆమె హీరోయిన్ అయ్యింది.అయితే 2015 లో తరుణ్ భాస్కర్ కి పెళ్లి చూపులు సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం తో అతడి సినిమాలో రీతూ ని హీరోయిన్ గా ఎంచుకున్నాడు.ప్రస్తుతం ఆమె తెలుగు తో పాటు తమిళ్ లో కూడా బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది.‘కేశవ’, ‘టక్ జగదీష్’, ‘వరుడు కావలెను’ వంటి సినిమాల్లో ఆమెకు హీరోయిన్ గా మంచి మార్కులే పడ్డాయి.ఇక ఈ మధ్యలో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాలో వైష్ణవి పాత్రలో నటించింది.ఇలా తరుణ్ భాస్కర్ ఆమెకు రెండు సార్లు క్రేజీ ఆఫర్స్ ఇచ్చి ఆమె ఎదుగుదలలో హెల్ప్ అయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube