Victoria Polls : విక్టోరియా రాష్ట్ర ఎన్నికలు : భారతీయులను ప్రసన్నం చేసుకునే పనిలో ఆస్ట్రేలియా పార్టీలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.ఇక ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో భారతీయులు వున్నారు.

 Ahead Of Victoria State Polls, Australian Parties Woo Indian-origin Voters,victo-TeluguStop.com

ఈ విషయం పలు దేశాల్లో జరిగిన ఎన్నికల్లో రుజువైంది కూడా.తాజాగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ఎన్నికలకు నగారా మోగడంతో భారతీయులను ఆకట్టుకునేందుకు అక్కడి పార్టీలు శ్రమిస్తున్నాయి.

దీనిలో భాగంగా విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ , ఎంపీ డేనియల్ ఆండ్రూస్ మతపరమైన పుణ్యక్షేత్రాలను సందర్శించి హామీలు గుప్పిస్తున్నారు.

ఈ సందర్భంగా సిక్కు కమ్యూనిటీకి సాంస్కృతిక గ్రాంట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.

గత వారం మెల్‌బోర్న్‌లోని శ్రీ దుర్గా దేవాలయాన్ని ఆయన సందర్శించారు.మరోసారి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.

భారతీయ ప్రాజెక్ట్‌లలో 10 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లను పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చారు.అలాగే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అతిపెద్ద లంగర్‌ను నిర్వహించే అవకాశాన్ని ప్రీమియర్ ప్రస్తావించారు.

ఇందులో రాష్ట్రవ్యాప్తంగా వున్న గురుద్వారాల నుంచి పాల్గొనవచ్చని తెలిపార.

Telugu Australia, Labor, Melbourne, Sikh Community, Victoria-Telugu NRI

ఆండ్రూస్ నేతృత్వంలోని ప్రస్తుత లేబర్ ప్రభుత్వం విక్టోరియా రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకోవాలని కోరుతోంది.విక్టోరియా రాష్ట్రంలో దాదాపు 2,76,770 మంది భారత సంతతి ఓటర్లు వున్నారు.నవంబర్ 26న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.2021 జనాభా లెక్కల ప్రకారం.భారతీయ కమ్యూనిటీలో సిక్కులు ఆస్ట్రేలియాలో పెద్ద జాతులలో ఒకరు.

పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో భారతీయ సమాజం లేబర్ వైపే మొగ్గు చూపుతోందని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.విక్టోరియా రాష్ట్ర ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్రులతో కలిపి దాదాపు 50 మంది భారతీయులు పోటీపడుతున్నారు.

వీరిలో అత్యధికంగా న్యూ డెమోక్రాట్స్ పార్టీకి చెందినవారే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube