Jugaad Musical Instrument: ఐరెన్ డబ్బా, చెక్క కర్రతో గిటార్ చేసిన యువకుడు... దాసోహం అయిపోతున్న నెటిజన్లు!

సోషల్ మీడియా బాగా విస్తరించడంతో దేశం నలుమూలలా జరుగుతున్న ఆసక్తికరమైన విషయాలను యిట్టె తెలుసుకోగలుగుతున్నాం.ఈ క్రమంలో ఒక వీడియో నెటిజన్లు బాగా షేర్ చేస్తున్నారు.

 Indian Man Desi Jugaad Musical Instrument With Iron Box Wooden Stick Video Viral-TeluguStop.com

భారతదేశం వివిధ కళలకు ప్రసిద్ధి.జుగాడ్ వంటి ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడంలో భారతీయులది చాలా ప్రత్యేకమైన శైలి.

ఈ నేపథ్యంలో కొంతమంది ‘దేశీ జుగాడ్ ‘లతో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు.ప్రస్తుతం, సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో ఒకటి ప్రజల దృష్టిని ఆకర్షించింది.

సదరు వీడియోలో ఒక వ్యక్తి జుగాడ్ తో సంగీత వాయిద్యాన్ని జీరో బడ్జెట్లో తయారు చేశాడు.అది చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.దానినుండి వెలువడిన సంగీతాన్ని విన్న ప్రతి ఒక్కరి హృదయం పులకించి పోతోంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా అనేకమంది లైక్స్ చేస్తున్నారు.

ఒక్క జుగాడ్ తో ఇందులోని వ్యక్తి రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెలిబ్రిటీ అయిపోయాడు.మనం చాలా సార్లు.

రైళ్లలో లేదా దారిలో ప్రయాణంలో, ప్రతిభతో నిండిన ఇలాంటి అనేక మంది వ్యక్తులను చూస్తూ ఉంటాం.అయితే వారికి డబ్బు, హోదా లేకపోవడం వలన వారి ప్రతిభ వెలుగు చూడదు.

సదరు వీడియో చూసిన నెటిజన్లు ఇదే అభిప్రాయాన్ని వెళ్లగక్కుతున్నారు.ఇలాంటివారికి చేయూతనిస్తే అద్భుతాలు చేస్తారని చెబుతున్నారు.అయితే ఇపుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటివారి ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది.జుగాడ్‌తో తయారు చేసిన గిటార్ లాంటి వాయిద్యంతో ఆ వ్యక్తి ‘మేరే రష్కే కమర్’ పాటను ప్లే చేస్తుండటం మనం గమనించవచ్చు.

వైరల్ అయిన క్లిప్‌లో, వ్యక్తి జుగాడు వాయిద్యంపై ట్యూన్ ప్లే చేస్తున్న తీరు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.dn_bundeli_damoh_studio పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube