ఆదివారం నాడు టి20 ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ గెలవడం తెలిసిందే.ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది.
దీంతో మొదట బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఇందు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్… ఐదు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి విజయం సాధించింది.
దీంతో టి20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ వశం అయింది.
ప్రపంచ కప్ గెలవడంతో ఇంగ్లాండ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
విషయంలోకి వెళ్తే ఇంగ్లాండ్ లో క్రికెట్ పుట్టిన గాని… 2010 వరకు ఆ దేశం ఏమీ సాధించలేదు.దీంతో అనేక ట్రోల్స్ వచ్చేవి.కానీ 2010 టి20 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ గెలుచుకోవడం జరిగింది.ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచ కప్ కూడా ఇంగ్లాండ్ గెలవడం, ఇప్పుడు 2022 T20 వరల్డ్ కప్ సొంతం చేసుకోవడం జరిగింది.
దీంతో వన్డే, T20 వరల్డ్ కప్ లు ఇప్పుడు ఇంగ్లాండ్ టీం వద్దే ఉన్నాయి.ఇలా రెండు కప్ లు ఓకే టీం వద్ద ఉండటం క్రికెట్ చరిత్రలో ఇది తొలిసారి.