టాలీవుడ్ యువ దర్శకులలో మొదటి సినిమా ఎవరికీ తెలియకపోయినా సెకండ్ మూవీ జాతిరత్నాలుతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు డైరక్టర్ అనుదీప్ కెవి.బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నా సరే అనుదీప్ లో ఎలాంటి గర్వం కనిపించదు.
జాతిరత్నాలు తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించాడు అనుదీప్.ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
ఇక లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ మూవీ చేశాడు అనుదీప్.ఈ సినిమాకు తెలుగులో పాజిటివ్ రివ్యూస్ వచ్చినా తమిళంలో సినిమా నిరాశపరచింది.
ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అనుదీప్ కెవి.జర్నలిస్ట్ ప్రేమ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుదీప్ తనకు సంబందించిన పర్సనల్ ప్రొఫెషనల్ అన్ని విషయాలని పంచుకున్నారు.
ఇక మీదట తను ఇంటర్వ్యూస్ ఇవ్వనని.తన గురించి చెప్పాల్సినదంతా చెప్పేశానని అన్నార్ అనుదీప్ కెవి.
ఇక మీదట చేసే సినిమాల ప్రెస్ మీట్ లో తప్ప ఇంటర్వ్యూస్ ఇవ్వనని అంటున్నారు అనుదీప్.మొత్తానికి అనుదీప్ కెవి ఓ షాకింగ్ డెశిషన్ తీసుకున్నారని చెప్పొచ్చు.