Google Sukarma Thapar : గూగుల్ సంస్థకు చుక్కలు చూపించిన భారతీయ యువతి.. ఏం చేసిందంటే

తమ చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చాలా మంది తమకు ఎందుకులే అని పట్టించుకోకుండా వదిలేస్తారు.కొందరు మాత్రం అన్యాయాలను సహించలేరు.

 What Did The Young Indian Woman Do To Google , Google, Technology Updates, Indi-TeluguStop.com

తమ ప్రత్యర్థి ఎంతటి వారైనా తలపడాలని చూస్తారు.అన్యాయంపై పోరాడి, న్యాయం జరిగే వరకు విశ్రమించారు.

తాజాగా భారత్‌కు చెందిన సుకర్మ థాపర్ అలాంటి కోవలోకే వస్తారు.న్యాయ విద్య చదివి లాయర్ అయిన ఆమె తన సహచరులతో కలిసి ఏకంగా గూగుల్ సంస్థకు చుక్కలు చూపించారు.సీసీఐకు ఫిర్యాదులు చేసి రూ.1338 కోట్ల జరిమానా పడేలా చేశారు.దీంతో దేశవ్యాప్తంగా ఆ యువతి పేరు మార్మోగిపోతోంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Telugu Akib, Fine, Google, Indian, Sukarma Thapar, Ups, Umar Javed, Latest, Youn

ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో బహుళ మార్కెట్‌లలో ఆధిపత్యం కోసం గూగుల్ ప్లాన్ వేసింది.ఏ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయినా, గూగుల్ సంస్థ రూపొందించిన యాప్‌లు ఉండేలా చేసింది.అవి మనకు ఉపయోగ పడినా, పడకపోయినా ఖచ్చితంగా ఫోన్లలో ఉండేలా ప్లాన్ రూపొందించింది.కొన్ని ఫోన్లలో ఇన్‌బిల్ట్ యాప్‌లను మనం తీసేయాలన్నా సాధ్యం కాదు.దీని వల్ల ఫోన్లలో స్టోరేజీ పెరుగుతుంది.దీనిపై సుకర్మ థాపర్ దృష్టిసారించింది.

తన సహచరుడైన ఉమర్ జావేద్, అతడి తమ్ముడు ఆకిబ్‌లతో కలిసి గూగుల్ సంస్థ ఆధిపత్యం కోసం చేపడుతున్న కార్యకలాపాలపై అధ్యయనం చేశారు.ముగ్గురు యువ లాయర్లు న్యాయవాద వృత్తిలోనే ఉంటూ గూగుల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సంపాదించారు.

దీనిపై మన దేశంలో కార్పొరేట్ వ్యవహారాలను పర్యవేక్షించే సీసీఐకు ఫిర్యాదు చేశారు.భారత్‌లో డిజిటల్ మార్కెట్ ఎలా రూపుదిద్దుకుంటోంది, టెక్నాలజీని నియంత్రించే విధానాలు, చట్టాలు వినియోగదారులను, టెక్ కంపెనీలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనే విషయాలపై ఆ ముగ్గురూ బాగా పరిశోధన చేశారు.

అప్పుడు యూరప్‌లో గూగుల్‌కు సంబంధించిన సంఘటనలు ముగ్గురి దృష్టిని ఆకర్షించాయి.జులై 2018లో, యూరోపియన్ కమీషన్ యాంటీట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గూగుల్‌పై 4.34 బిలియన్ యూరోల అతిపెద్ద జరిమానా విధించిందనే విషయం తెలుసుకున్నారు.ఇలాంటి సమాచారాన్ని సేకరించి సీసీఐకు ఫిర్యాదు చేశారు.

దీంతో గూగుల్‌కు సీసీఐ కోలుకోలేని షాక్ ఇచ్చింది.రూ.1338 కోట్ల జరిమానా గూగుల్‌కు పడింది.దీంతో సుకర్మా థాపర్ పేరు ప్రస్తుతం దేశంలో బాగా వినిపిస్తోంది.

ఏకంగా గూగుల్‌ సంస్థకే షాకిచ్చిన యువతిగా ఆమెను పలువురు ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube