మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి వ్యాఖ్యలైన చేసుకోవచ్చు, ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు ఆ వ్యాఖ్యలు, పనులు బహిరంగంగా చేస్తూ, సమాజానికి చెడు చేసేవిలా అభ్యంతరకరంగా ఉంటే మాత్రం ఆ పనుల తాలూఖు ఫలితం మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది.మన సువిశాల భారత దేశంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మనవాళ్ళే కదా అంటూ పెద్దగా పట్టించుకోక పోవచ్చు కానీ ఇతర దేశాలు మాత్రం అలాంటి వ్యాఖలు చేస్తే మాత్రం తోలు తీసి ఆరబెడుతాయి.
ముఖ్యంగా అరబ్బు దేశాలు ఈ విషయంలో మాత్రం పక్కా క్లారిటీ గా ఉంటాయి.అందులోనూ కువైట్ ఈ రూల్స్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు…తాజాగా
కువైట్ తమ దేశంలో ఉన్న ప్రవాసులకు కీలక సూచనలు జారీ చేసింది.
ఇప్పటికే తమ దేశం నుంచీ ప్రవాసులను ఎలా వెళ్ళగొట్టాలో అనే ప్రణాలికలు చేస్తున్న కువైట్ తాజాగా మరో నిభందనను అమలులోకి తీసుకువచ్చింది.ఇకపై కువైట్ లో హింసాత్మక, చట్ట వ్యతిరేకత కార్యక్రమాలలో ఖర్మకాలి ఎవరైనా పాల్గొంటే దేశం నుంచీ నిర్దాక్షిణ్యంగా బహిష్కరణ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.అయితే
ఈ బహిష్కరణ కు మంత్రిత్వశాఖ అండర్ సెక్రెటరీ ఆమోదం కూడా అవసరం లేదని మెడ పట్టుకుని బయటకు పంపుతామని తెలిపింది.తాజా చట్టం ప్రకారం ఏ వ్యక్తైనా సరే హింసాత్మక, ఘటనల్లో పాల్గొంటే ఈ చట్ట పరిధిలోకి వస్తారని ప్రకటించింది.ఇదిలాఉంటే వ్యక్తిగత స్వేఛ్చకు విరుద్దంగా ఈ చట్టం ఉందనే ప్రశ్న లేవనెత్తగా తాము తీసుకున్న నిర్ణయం మానవ హక్కులకు విరుద్దం కాదని, మంత్రిత్వశాఖ వెల్లడించింది.ఇటీవల కాలంలో వలస వచ్చిన వారి చర్యల పట్ల కువైట్ లో హింసాత్మక ఘటనలు జరిగాయని ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి కటినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రకటించింది.
.