యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం లో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా గురించి గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
రాజా డీలక్స్ అనే టైటిల్ ని ఆ సినిమా కోసం అనుకున్నారని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు.కానీ రాజా డీలక్స్ టైటిల్ ఇతర భాషలకు సరిగ్గా సెట్ అవ్వడం లేదని ఉద్దేశం తో మరో టైటిల్ ని దర్శకుడు మారుతి కన్ఫమ్ చేశాడట.
ఇప్పటి వరకు అది అధికారికంగా బయటికి రాలేదు.కానీ రకరకాలుగా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి.
మరో వైపు ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.అలాగే ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయ్యిందట.
ఈ విషయాన్ని పూర్తి రహస్యం గా చిత్ర యూనిట్ సభ్యులు ఉంచడం విడ్డూరం గా ఉంది అంటూ ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.చాలా మంది ప్రభాస్ అభిమానులు మారుతి దర్శకత్వం లో సినిమా వద్దు అంటూ ప్రభాస్ కి విజ్ఞప్తి చేస్తున్నారు.
వారు ఈ సమయం లో ఆందోళన చేస్తారనే ఉద్దేశంతోనే మొదటి షెడ్యూల్ పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటున్నారు.

మారుతి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా షెడ్యూల్ ని తాజాగా పూర్తి చేసిన ప్రభాస్ మొన్నటి నుండి ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న సలార్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.నవంబర్ చివరి వారం లో లేదా డిసెంబర్ లో మళ్లీ మారుతి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాల్లో ప్రభాస్ హాజరు కాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.మరీ ఇంత రహస్యంగా సినిమాను రూపొందించాల్సిన అవసరమేంటి అంటూ కొందరు మారుతిని ప్రశ్నిస్తున్నారు.
విడుదల సమయం లో ఆయన అందరికీ చెబుతారా లేదంటే రహస్యంగానే రిలీజ్ చేస్తారా అంటూ కొందరు ఫన్నీ గా కామెంట్ చేస్తున్నారు.